Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీకి ప్రధానమంత్రి హార్థిక స్వాగతం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌సిసీకి హార్థిక స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానంపై అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌సిసీ  2023 జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. భారతదేశంలో రెండో సారి అధికారిక పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు సిసీ 74వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా హాజరవుతారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇలా ట్వీట్‌ చేశారు.
‘‘అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌సిసీ …భారతదేశానికి మీకు హార్థిక స్వాగతం. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు మీరు భారతదేశంలో అధికారిక పర్యటనకు రావడం భారతీయులందరికీ ఆనందదాయకం. రేపు మీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను@AlsisiOfficial’’