నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి గౌరవార్థం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు న ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోవడాని కి ఎంపిక అయిన యువజనుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, ‘నో యువర్ లీడర్’ (‘మీ నేత ను గురించి తెలుసుకోండి’) అనే కార్యక్రమం లో భాగం గా మాట్లాడారు. ఈ సంభాషణ ఆయన నివాసం అయిన 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరిగింది.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో యువజనుల తో స్పష్టమైనటువంటి మరియు ఎటువంటి అరమరికల కు తావు ఉండనటువంటి రీతి లో మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి జీవితం లోని వివిధ అంశాల ను గురించి, ఆయన నుండి మనం ఏమేమి నేర్చుకోగలుగుతాం అనే విషయాల ను గురించి ప్రధాన మంత్రి చర్చించారు. చరిత్ర లో స్థానాన్ని పొందిన ప్రముఖులు వారి జీవనం లో ఏయే విధాలైన సవాళ్ళ ను ఎదుర్కొని మరి వాటి ని ఎలాగ అధిగమించిందీ తెలుసుకోవడం కోసం వారి యొక్క జీవిత కథల ను చదివే ప్రయత్నం చేయండంటూ యువజనుల కు ప్రధాన మంత్రి సూచించారు.
దేశ ప్రధాన మంత్రి ని కలుసుకొనే మరియు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో కూర్చొనే అపూర్వ అవకాశం దక్కినందుకు యువజనులు వారి లో రేకెత్తించిన ఉత్సుకత ను గురించి వెల్లడించారు. దేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన ఇంత మంది ఈ కార్యక్రమానికి రావడం తో ‘భిన్నత్వం లో ఏకత్వం’ అంటే ఏమిటో అర్థం చేసుకొనే అవకాశం కూడా తమ కు లభించిందని వారు చెప్పారు.
జాతీయ ప్రముఖుల కు పార్లమెంటు లో పుష్పాంజలి ని సమర్పించేందుకు ప్రముఖుల కు మాత్రమే ఆహ్వానాన్ని అందించే గత అభ్యాసాన్నుండి ఒక మేలు మలుపా అన్నట్లుగా, ఈ 80 మంది యువజనుల ను నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి గౌరవార్థం పార్లమెంటులో ఏర్పాటు చేసిన పుష్పాంజలి కార్యక్రమం లో పాలుపంచుకొనేందుకు దేశ వ్యాప్తం గా పలు ప్రాంతాల నుండి ఎంపికచేయడమైంది. వారిని ‘నో యువర్ లీడర్’ (‘మీ నేత ను గురించి తెలుసుకోండి’) అనే కార్యక్రమం లో భాగం గా ఎంపిక చేయడం జరిగింది. పార్లమెంటు లో నిర్వహిస్తున్న పుష్పాంజలి కార్యక్రమాల ను ఉపయోగించుకొంటూ జాతీయ ఐకన్ ల జీవనాన్ని గురించి మరియు వారి సేవల ను గురించి భారతదేశం లోని యువజనుల మధ్య మరింత జ్ఞానాన్ని, చైతన్యాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ ‘నో యువర్ లీడర్’ కార్యక్రమాన్ని ఒక ప్రభావయుక్త మాధ్యం గా ఉపయోగించుకోవాలని ప్రారంభించడమైంది. ఈ యువజనుల ను దీక్ష పోర్టల్ (DIKSHA portal) లో మరియు మైగవ్ (MyGov) ప్లాట్ ఫార్మ్ లో క్విజ్ ను చేర్చుతూను; ఇంకా, ఒక విస్తృతమైన, ఉద్దేశ్యపూర్ణమైన మరియు యోగ్యత ఆధారితమైన ప్రక్రియ ద్వారాను, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల లో ఉపన్యాసం / వక్తృత్వ పోటీ ని పెట్టడం ద్వారాను, నేతాజీ యొక్క జీవనం పై మరియు ఆయన చేసిన సేవల పై విశ్వవిద్యాలయాల లో ఒక పోటీ ని నిర్వహించడం ద్వారాను.. ఈ తరహా మాధ్యాల లో కనబరచిన ప్రతిభ ను బట్టి ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన వారి లో 31 మంది కి పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఏర్పాటైన పుష్పాంజలి కార్యక్రమం లో పాల్గొని, ‘నేతాజీ తోడ్పాటు లు’ అంశం పైన మాట్లాడే అవకాశం కూడా దక్కింది. వారు అయిదు భాషలు.. హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, మరాఠీ ఇంకా బాంగ్లా.. లలో మాట్లాడారు.
***
Had a lively interaction with a group of youngsters from across the country who were a part of the ‘Know Your Leader’ programme. Here are highlights from this programme. pic.twitter.com/0MZRZ5L5lx
— Narendra Modi (@narendramodi) January 24, 2023