Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ప్ర‌ధాన మంత్రి చేతుల మీదుగా జంగిల్ స‌ఫారీ ప్రారంభం; పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ విగ్ర‌హావిష్క‌రణ; రాజ్యోత్స‌వ్ ప్రారంభం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని న‌యా రాయ్ పూర్ ను సంద‌ర్శించారు. ఆయన జంగిల్ స‌ఫారీని ప్రారంభించి, అక్కడ కాసేపు గ‌డిపారు. పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ శిలావిగ్ర‌హాన్ని శ్రీ మోదీ ఆవిష్క‌రించారు. సెంట్ర‌ల్ బూలవర్డ్ ను ‘ఏకాత్మ‌ పథ్’గా అంకితం చేశారు. ఆ త‌రువాత నయా రాయ్ పూర్‌ బి ఆర్ టి ఎస్ ప్రాజెక్టును కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

“హ‌మార్ ఛ‌త్తీస్‌గ‌ఢ్ యోజ‌న”లో పాల్గొంటున్న‌వారితో ప్ర‌ధాన మంత్రి భేటీ అయ్యారు. రాజ్యోత్స‌వ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి ఒ డి ఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్రచార ఉద్యమంలో చక్కని పనితీరును కనబరచినందుకు రెండు జిల్లాలు, ప‌దిహేను బ్లాకుల‌కు చెందిన అధికారుల‌కు స‌ర్టిఫికెట్ లను పంపిణీ చేశారు. ఉజ్జ్వ‌ల ప‌థ‌కంలో భాగంగా ఎల్ పిజి క‌నెక్ష‌న్ లను ల‌బ్ధి దారుల‌కు పంపిణీ చేశారు. అలాగే, సౌర ఉజాలా యోజ‌న ప్రారంభ సూచకంగా సౌర శక్తితో వెలిగే దీపాల‌ను ఎంపిక చేసిన ల‌బ్ధిదారుల‌కు అందించారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ తో క‌లుపుకొని మూడు కొత్త రాష్ట్రాల‌ను శాంతియుతంగాను, సామరస్య వైఖరితోను ఏర్పాటు చేసిన ఘ‌న‌త పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయికి ద‌క్కుతుంద‌నే విష‌యాన్నిఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు.

సాపేక్షంగా ఒక చిన్న రాష్ట్ర‌మైన ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎలా అభివృద్ధిలో నూతన శిఖ‌రాల‌ను అందుకోగలుగుతుందో రాష్ట్ర ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ నిరూపించారంటూ ఆయనను ప్రధాన మంత్రి అభినందించారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రభావం రానున్న త‌రాల‌కు లబ్ధిని చేకూర్చగలదని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి అన్నారు. రాష్ట్ర ప‌ర్యాట‌క‌ రంగానికి గొప్ప సామర్థ్యం ఉందనిపిస్తోందని, ఇది రాష్ట్రంలోని పేద‌లలోకెల్లా అత్యంత పేద వారికి సరికొత్త ఆర్థిక అవకాశాలను అందించగల సత్తాను కలిగివుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

వ్యవసాయదారుల శ్రమకు అద‌న‌పు విలువను జోడించేందుకు వీలుగా కార్య‌క్ర‌మాలను చేపడుతున్నందుకుగాను కూడా ఛత్తీస్ గఢ్ రాష్ట్రాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.

***