Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్ లోని భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలో జవానులతోను, ప్రజలతోను కలసి దీపావళి పండుగను జరుపుకొన్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జవానులతో కలసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా లోని భారత-చైనా సరిహద్దు సమీప ప్రాంతమైన సుమ్ డో ను ఈ రోజు సందర్శించారు.

భారతీయ సైన్యం మరియు ఐటిబిపి లకు చెందిన సైనికులతో ఆయన సంభాషించి, వారికి మిఠాయిలు అందజేశారు.

జవానులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 2001 నుండి ప్రతి సంవత్సరం సాయుధ దళాల సిబ్బందిని తాను కలుసుకొంటున్నట్లు గుర్తుచేశారు.

#Sandesh2Soldiers ప్రచార ఉద్యమంలో భాగంగా సైనికులకు సందేశాలను పంపవలసిందిగా తాను చేసిన విజ్ఞప్తికి దేశ వ్యాప్తంగా మహత్తరమైన ప్రతిస్పందన వచ్చిన సంగతిని ఆయన ప్రస్తావించారు.

మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇస్తామన్నది తాను చేసిన వాగ్దానమని, దానిని నెరవేర్చగలిగినందుకు తాను ఆనందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సైనిక దళ ప్రధానాధికారి జనరల్ శ్రీ దళ్ బీర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.

సుమ్ డో నుండి తిరిగివచ్చేటప్పుడు ప్రధాన మంత్రి సమీప గ్రామం ఛాంగో లో కొద్ది సేపు ఆగారు. ఆయన ప్రజలతో ముచ్చటించి, చిన్న పిల్లలకు మిఠాయిలు అందజేశారు.