Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.   సామాజిక సంస్కరణల కు, గ్రామీణ అభివృద్ధి కి మరియు భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమం లో ఆయన అందించిన తోడ్పాటు ను కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ఆయన కు ఇదే శ్రద్ధాంజలి.  సమాజ సంస్కరణ లో ఆయన అందించినటువంటి తోడ్పాటు మరియు ఆయన యొక్క సేవ ప్రజల లో అనేక మంది కి ప్రేరణ ను ఇచ్చేటటువంటివి గా ఉన్నాయి.  గ్రామీణ అభివృద్ధి ని పెంపొందింప చేయడం కోసం ఆయన చేసిన ప్రయాసల కు గాను ఆయన ను చాలా మంది గౌరవించడం జరుగుతున్నది.  ఆయన భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమాని కి ఘనమైన తోడ్పాటు ను అందించారు.’’ అని పేర్కొన్నారు.

 

 

*****

DS/TS