రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
సమర్ కంద్ లో ఎస్ సిఒ శిఖర సమ్మేళనం జరిగినప్పుడు వీరు ఇరువురి మధ్య చోటు చేసుకొన్న భేటీ కి అనుశీలనం గా ఇరువురు నేత లు ద్వైపాక్షిక సంబంధాల తాలూకు అనేక పార్శ్వాల ను సమీక్షించారు; ఆ పార్శ్వాల లో శక్తి రంగ సంబంధి సహకారం, వ్యాపారం మరియు పెట్టుబడులు, రక్షణ , ఇంకా భద్రత పరమైన సహకారం సహా, ఇతర కీలక రంగాలు ఉన్నాయి.
యూక్రేన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ కు సంబంధించి చర్చ మరియు దౌత్యం.. ఇవి మాత్రమే ఇక మిగిలివున్న ఏకైక మార్గం అని ప్రధాన మంత్రి తాను ఇప్పటికే ఇచ్చిన పిలుపు ను పునరుద్ఘాటించారు.
జి20 కి ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తుండడాన్ని గురించి, భారతదేశం యొక్క కీలక ప్రాధాన్యాల ను గురించి అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి వివరించారు. శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ కు భారతదేశం అధ్యక్షత ను వహిస్తున్న కాలం లో తమ ఉభయ దేశాలు కలిసికట్టుగా పని చేయాలి అని కూడా తాను ఆశపడుతున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
నేత లు వారు ఉభయులు ఒకరితో మరొకరు క్రమం తప్పక సంప్రదింపుల ను కొనసాగించడానికి తమ సమ్మతి ని వ్యక్తం చేశారు.
***