Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి శతాబ్ది మహోత్సవ్ తాలూకు ప్రారంభికకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి శతాబ్ది మహోత్సవ్ తాలూకు ప్రారంభికకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి శతాబ్ది మహోత్సవ్ తాలూకు ప్రారంభిక కార్యక్రమం ఈ రోజు న అహమదాబాద్ లో ఏర్పాటవగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తం గా నిర్వహించిన వేడుకలు ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్తో పూర్తి అవుతాయి. ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్ కు బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం అయినటువంటి శాహీబాగ్ లోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్ ఆధ్వర్యం వహించింది. ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్ ను 2022వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ నాటి నుండి 2023వ సంవత్సరం జనవరి 15వ తేదీ వరకు అహమదాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రోజు జరిపే కార్యక్రమాలు, ఫలానా ఇతివృత్తం ఆధారంగా ఏర్పాటు చేసే ప్రదర్శన లు, ఇంకా ఆలోచనల ను రేకెత్తించేటటువంటి మండపాల వంటివి దీని లో భాగం గా చోటు చేసుకోనున్నాయి.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి ని కొనియాడడం ద్వారా తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు; ఈ మహత్వపూర్ణ ఘట్టం లో పాలుపంచుకోండి అంటూ ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి స్వాగత వచనాలను పలికారు. ప్రధాన మంత్రి ఆ పరిసరాల లో దివ్యత్వం నెలకొందని తన అనుభూతి ని తెలియజే చేశారు. అంతేకాక తీర్మానాల యొక్క గొప్పదనాన్ని మరియు వారసత్వం యొక్క గౌరవాన్ని కూడా ఆయన వ్యక్తంచేశారు. పరిసరాల లో భారతదేశం లోని ప్రతి ఒక్క వన్నె ను అందరూ చూడవచ్చును అని ఆయన అన్నారు.

 

ఇంతటి భవ్యమైన సమ్మేళనాన్ని నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచన చేసిన ప్రతి ఒక్క సాధువు కల్పన శక్తి కి గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియజేశారు. ఈ వైభవోపేతమైన కార్యక్రమం యావత్తు ప్రపంచం దృష్టి ని ఆకట్టుకోవడం ఒక్కటే కాకుండా భావి తరాల పై తన ప్రభావాన్ని ప్రసరింప చేయడం తో పాటు గా ప్రేరణ ను కూడా అందించగలుగుతుంది అని ఆయన అన్నారు. ‘‘ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున నిర్వహించాలి అనే సంగతి ని ఆలోచించినందుకు గాను, సాధువుల ను, మునుల ను నేను అభింనందించ దలచాను’’ అని ఆయన అన్నారు. పూజ్య ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు తన కు తండ్రి వంటి వారు అని ప్రధాన మంత్రి చెప్తూ, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి కార్యక్రమాని కి ప్రజలు ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించడానికి ఇక్కడకు తరలివస్తారు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ శతాబ్ది వేడుక ను ఐక్య రాజ్య సమితి సైతం నిర్వహించిందన్న విషయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ పరిణామం భారతదేశం యొక్క చిరస్థాయి ప్రాముఖ్యాన్ని మరియు సార్వత్రిక ప్రాముఖ్యాన్ని చాటిచెబుతోందన్నారు. స్వామి మహారాజ్ గారి తో సహా భారతదేశం లోని గొప్ప సాధువులు వసుధైవ కుటుంబకమ్అనే భావన ను ప్రముఖం గా ప్రతిష్ఠింపచేశారు. అయితే, స్వామి మహారాజ్ గారు దీనికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించారు అని ప్రధాన మంత్రి అన్నారు. వేదాలు మొదలుకొని వివేకనందుల వారి వరకు పురోగమించిన ఈ ప్రస్థానాన్ని నేటి శతాబ్ది వేడుక లో గమనించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇక్కడ ఏ వ్యక్తి అయినా భారతదేశం లోని సదాచారి సంప్రదాయాల ను దర్శించవచ్చును’’ అని ఆయన అన్నారు. మన సదాచారి సంప్రదాయాలు అనేవి సంస్కృతి, తెగ, నీతి శాస్త్రం, ఇంకా భావవాదం ల వంటి వాటి ప్రచారానికి మాత్రమే పరిమితం కావు. భారతదేశం లోని సాధువులు వసుధైవ కుటుంబకమ్తాలూకు భావావేశాన్ని ఇనుమడింప జేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక్కటి గా నిలిపి ఉంచాలని చూశారు అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వామి జీ తో తన కు ఉన్న సంబంధాన్ని ప్రధాన మంత్రి జ్ఞాపకాని కి తెచ్చుకొంటూ, ‘‘నేను నా బాల్యం నుండే పరమ పూజనీయులు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి ధ్యేయాల వైపునకు ఆకర్షింపబడ్డాను. నా జీవనం లో ఏదో ఒక రోజు న ఆయన తో భేటీ అయ్యే సన్నివేశం ఎదురవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బహుశా 1981వ సంవత్సరం లో అనుకుంటాను.. ఒక సత్సంగం వేళ లో ఆయన ను నేను కలుసుకొన్నాను. సేవ ను గురించి మాత్రమే ఆయన మాట్లాడారు. ఆయన పలికిన ప్రతి పలుకు నా హృదయం లో తిష్ట వేసుకు కూర్చుండిపోయింది. ఆయన సందేశం చాలా స్పష్టం గా ఉండింది. అది ఏమిటి అంటే సేవ యే ఏ వ్యక్తి జీవనం లో అయినా పరమార్థం కావాలి అనేదే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఎదుటి వ్యక్తి యొక్క అవగాహన శక్తి ని బట్టి స్వామి జీ తాను అందించదలచుకొన్న సందేశాన్ని సులువు గా చెప్పే వారు అంటూ ప్రధాన మంత్రి స్వామి గారి కరుణ గురించి వివరించ సాగారు. ఇది స్వామి జీ యొక్క వ్యక్తిత్వం ఎంత విశాలమైందో సూచిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరు స్వామి జీ ని ఒక ఆధ్యాత్మిక వ్యక్తి గానే భావించారు. కానీ, ఆయన ఒక సమాజ సంస్కరణ వాది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు. ఆధునిక కాలం లో అందివచ్చే అవకాశాలు ఏ తరహా కు చెందినవి అనేది స్వామి జీ కి కరతలామలకం. మరి తన ఎదుట ఉన్న వ్యక్తి యొక్క సమస్యల ను గురించి పట్టించుకోవడం లో స్వామి జీ కి స్వతఃసిద్ధ శక్తి అంటూ ఉండేది అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క శ్రేయస్సు అనే అంశాన్ని గురించి ఆయన మరీ మరీ చెప్పే వారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘పరమ పూజనీయులు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు ఒక సంస్కరణవాది. ఆయన ప్రతి వ్యక్తి లో ఉన్న మంచినే చూసేటటువంటి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే వారు. ప్రతి వ్యక్తి తన లోపలి ఈ బలాల పై దృష్టి సారించాలి అంటూ ఆయన ప్రోత్సహించే వారు. తన దగ్గర కు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కి ఆయన సాయపడ్డారు. మోర్ బీ లో మచ్ఛూ ఆనకట్ట ప్రమాదం చోటు చేసుకొన్న వేళ స్వామి జీ పడిన పాటు ఎటువంటిది అన్నది నేను ఎన్నటికీ మరచిపోలేను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పూజ్య స్వామి జీ ని కలుసుకోవడం కోసం తాను వెళ్ళినప్పుడల్లా తన జీవనం లో జరిగిన అనేక కీలకమైన ఘటనల ను ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.

 

రాజ్ కోట్ లో 2002వ సంవత్సరం లో తాను అభ్యర్థి గా నిలచిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొని ఎన్నికల సంబంధి ప్రచారం లో ఇద్దరు సాధువులు తన ను కలుసుకొని ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు ఒక కలాన్ని మీకు అందజేసి ఆ కలం తో నామినేశన్ పత్రాల పైన సంతకం పెట్టమన్నారు అంటూ అభ్యర్థించారని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘అది మొదలు కాశీ ఎన్నికల వరకు ఇదే అభ్యాసం కొనసాగింది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఒక తండ్రి కి మరియు కుమారుని కి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని ప్రధాన మంత్రి పోలిక గా పేర్కొంటూ, కచ్ఛ్ లో ఒక స్వచ్ఛంద సేవకుని గా తాను పని చేస్తున్న కాలం లో తన కోసం ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు భోజన ఏర్పాటు ను చేశారు అని వెల్లడించారు. గడచిన 40 సంవత్సరాల లో తాను ఏటా క్రమం తప్పకుండా కుర్తా పైజమా లకు అవసరమైన వస్త్రాల ను పూజ్య స్వామి జీ వద్ద నుండే అందుకొన్న సంగతి ని కూడా ఆయన తెలియజేశారు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం. ఒక తండ్రి కి, కుమారుని కి నడుమ ఉండేటటువంటి సంబంధం అని ప్రధాన మంత్రి చెప్తూ, భావోద్వేగాని కి లోనయ్యారు. తాను దేశాని కి సేవ చేయడానికి వేస్తున్న ప్రతి అడుగు లో పూజ్య స్వామి జీ యొక్క దృష్టి తన మీద ఉందనే తాను భావిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి తో తనకు ఉన్న సంబంధాన్ని గురించి ప్రధాన మంత్రి మరింతగా వివరిస్తూ, 1991వ సంవత్సరం లో డాక్టర్ ఎమ్.ఎమ్. జోశీ గారి నాయకత్వం లో సాగిన ఏకత యాత్ర కు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, తాను జమ్ము కు చేరుకోగానే తనను పలకరించిన మొట్టమొదటి వ్యక్తి స్వామి మహారాజ్ గారు అని ప్రధాన మంత్రి గుర్తు చేసుకొన్నారు. ‘‘లాల్ చౌక్ లో జాతీయ జెండా ను ఎగురవేసిన తరువాత నేను జమ్ము కు చేరుకొన్నప్పుడు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు నన్ను సంప్రదించి నా యోగక్షేమాల ను గురించి అడిగారు’’ అని ఆయన తెలిపారు. అక్షర్ ధామ్ ఆలయం మీద ఉగ్రవాదులు దాడి కి తెగబడిన దురదృష్టకర స్థితి ని గురించి కూడా ప్రధాన మంత్రి తలచుకొన్నారు. అటువంటి గలాభా లో సైతం ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు నెమ్మది గా ఉండడాన్ని ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. పూజ్య స్వామి జీ యొక్క అంతరాత్మ సంబంధి శక్తి కారణం గానే ఈ సంతులత సాధ్యపడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

యమున తీరం లో అక్షర్ ధామ్ ను నిర్మించాలి అనేది ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి కోరిక అని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, అప్పట్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి కి శిష్యుని గా ఉండినటువంటి మహంత్ స్వామి మహారాజ్ గారి దార్శనికత ను గురించి నొక్కిచెప్పారు. ప్రజలు మహంత్ స్వామి మహారాజ్ గారిని ఒక గురువు గా భావించినప్పటికీ, ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ అంటే మహంత్ స్వామి గారి కి ఎంతటి గురుత్వ భావన ఉండేదో తాను ఎరుగుదునని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘యమున నది ఒడ్డు న అక్షర్ ధామ్ మందిరం నిర్మాణం జరిగింది అంటే అది ఆయన యొక్క దార్శనికత మరియు సమర్పణ భావాల తాలూకు ఫలితమే. ఏటా అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించే లక్షల కొద్దీ ప్రజలు ఆ దేవాలయ భవ్యత్వం ద్వారా భారతీయ సంస్కృతి మరియు భారతీయ సంప్రదాయాల ను గురించి అర్థం చేసుకొనే ప్రయత్నాల ను చేస్తున్నారు’’ అంటూ ప్రధాన మంత్రి తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ‘‘ప్రపంచం లో ఏ మూలకైనా వెళ్ళండి, మీరు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి యొక్క దృష్టి కోణం తాలూకు పర్యవసానాన్ని గమనించగలుగుతారు. ఆయన మన దేవాలయాల ను ఆధునికం గాను మరియు మన సంప్రదాయాల కు పట్టుగొమ్మ గా ఉండేటట్లుగాను శ్రద్ధ తీసుకొన్నారు. ఆయన వంటి మహానుభావుల కు తోడు రామకృష్ణ మఠం సైతం సంత్ పరంపర కు కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఆధ్యాత్మిక అభ్యున్నతి ని మించి సేవ తాలూకు సంప్రదాయాని కి పెద్ద పీట ను వేయడం లో పూజ్య స్వామి జీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సంన్యాసి పరిత్యాగాన్ని మాత్రమే కాకుండా, సమర్థుడి గా, చదువుసంధ్యలు ఉన్న వ్యక్తి గా తయారు కావాలి అని స్వామి జీ ఆ ప్రకారం గా జాగ్రతల ను తీసుకొనే వారు అని కూడా ప్రధాన మంత్రి వివరించారు. సంపూర్ణ ఆధ్యాత్మికవాద శిక్షణ కై స్వామి జీ ఒక వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు అని ప్రధాన మంత్రి చెప్పారు. ఇది రాబోయే అనేక తరాల పాటు దేశ ప్రజల కు మేలు చేస్తుంది అని ఆయన అన్నారు. ‘‘ ‘దైవం పట్ల భక్తి’, ‘దేశం పట్ల భక్తి.. వీటి ని ఆయన ఎన్నడూ వేరు చేసి చూడలేదు. ’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఎవరైతే దైవ భక్తిని కలిగి ఉంటారో, మరి ఎవరైతే దేశ భక్తితో మనుగడ సాగిస్తారో అటువంటి వారు ఆయన దృష్టి లో సత్సంగం లో భాగస్తులు అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘మన సాధువు లు సంకుచిత వర్గాల కంటే మిన్న గా పయనించివసుధైవ కుటుంబకంభావన ను బలపరచడానికి శ్రమించారు; ప్రపంచాన్ని ఒక్కటి చేయడం కోసం వారు తపించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి తన మనస్సాక్షి యొక్క యాత్ర ను గురించి చెప్తూ, తాను ఆ తరహా సదాచారిభరిత మరియు పురోగామి సంప్రదాయాల తో నిరంతరం సంబంధం పెట్టుకొంటూ వస్తున్నానని తన ప్రసంగం ముగింపు లో అన్నారు. ‘‘పగపట్టే, ప్రతీకారం తీర్చుకోవాలనుకొనే నేటి ప్రపంచం లో సద్గుణభరితమైన పరిసరాల ను సృజియించే టటువంటి ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు మరియు మహంత్ స్వామి మహారాజ్ గారు ల సాన్నిహిత్యం లభించినందుకు నేను అదృష్టవంతుడి ని. అది అలసి సొలసిన ఓ వ్యక్తి ఒక మహా వటవృక్షం నీడ న కూర్చొని సేద తీరడం వంటిది. ఒక వ్యక్తి రాజసిగానో, లేక తామసికునిగానో మనుగడ సాగించడం కాకుండాసాత్వికంగా ఉంటూ జీవనయాత్ర ను సాగించాలి’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, పరమ పూజనీయులు మహంత్ స్వామి మహారాజ్ గారు లతో పాటు పూజ్య ఈశ్వర్ చరణ్ స్వామి గారు తదితరులు కూడా ఉన్నారు.

పూర్వరంగం

పరమ పూజనీయులు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు ఒక మార్గదర్శి యే కాక భారతదేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తం గా అసంఖ్యాకుల జీవనం పై ప్రభావాన్ని ప్రసరించినటువంటి గురువు కూడాను. ఒక మహా ఆధ్యాత్మిక నేత గా ఆయన విస్తృతమైన ఆదరణ కు, అభిమానాని కి పాత్రుడు అయ్యారు. ఆయన తన జీవనాన్ని ఆధ్యాత్మిక వాదాని కి మరియు మానవ జాతి కి సేవ చేయడానికి సమర్పణం చేసివేశారు. బిఎపిఎస్ స్వామినారయణ్ సంస్థ నాయకుని గా ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాల కు, సామాజిక కార్యక్రమాల కు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కు ప్రేరణ ను ఇవ్వడం తో పాటుగా లక్షల కొద్దీ ప్రజల కు సంరక్షణ ను సైతం అందించారు.

పరమ పూజనీయులు ప్రముఖ్ స్వామి మహారాజ్ గారి శత జయంతి సంవత్సరం లో, ప్రపంచం లో అనేక దేశాల ప్రజలు ఆయన జీవనాన్ని మరియు ఆయన ప్రయాసల ను ఒక ఉత్సవం గా జరుపుకొంటున్నారు. ప్రపంచం అంతటా ఏడాది పొడవునా సాగిన ఉత్సవాలు బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ప్రపంచ వ్యాప్త ప్రధాన కార్యాలయం నెలకొన్న శాహీబాగ్ లోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్ ఆధ్వర్యం లో నిర్వహించేటటువంటి ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్తో ముగియనున్నాయి. ఈ మహోత్సవ్ ను ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అహమదాబాద్ లో 2022 డిసెంబర్ 15వ తేదీ మొదలుకొని 2023 జనవరి 15వ తేదీ వరకు ప్రతి రోజూ జరిపే కార్యక్రమాలు, ప్రత్యేక ఇతివృత్తం తో కూడిన ప్రదర్శన లు, ఆలోచనల ను రేకెత్తించేటటువంటి మండపాల వంటివి ఈ మహోత్సవ్ లో చోటు చేసుకోనున్నాయి.

బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ను శాస్త్రీజీ మహారాజ్ 1907వ సంవత్సరం లో స్థాపించారు. వేద ప్రబోధాల పై ఆధారపడి మరి ఆచరణాత్మక ఆధ్యాత్మిక వాదం తాలూకు మూలస్తంభాల దన్ను తో స్థాపించిన బిఎపిఎస్ నేటి కాలం లో సామాజికం గా, నైతికం గా, ఆధ్యాత్మికం గా ఎదురవుతున్నటువంటి సవాళ్ళ ను పరిష్కరించడం కోసం విరివి గా పాటుపడుతున్నది. విశ్వాసం, ఏకత్వం మరియు స్వార్థ రహితమైన సేవ అనే విలువల ను కాపాడడం బిఎపిఎస్ ధ్యేయం గా ఉంది. అలాగే జీవనం లో అన్ని రంగాల కు చెందిన ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన అవసరాల, సాంస్కృతికపరమైన అవసరాల ను, భౌతిక అవసరాల ను మరియు భావోద్వేగ భరిత అవసరాల ను తీర్చడం కోసం బిఎపిఎస్ తన వంతు కృషి ని చేస్తున్నది. ప్రపంచ వ్యాప్త సంపర్కం మరియు ప్రయాస ల ద్వారా ఈ సంస్థ మానవతాపూర్వక కార్యకలాపాల ను సైతం భుజాని కి ఎత్తుకొంటున్నది.

*****

DS/TS