ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 డిసెంబర్ 25వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు ప్రసారం కావలసి ఉన్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఎపిసోడ్ కోసం ప్రజలు వారి సూచనల ను వెల్లడించవలసిందంటూ ఆహ్వానించారు. ప్రజలు వారి ఆలోచనల ను Namo App, MyGov లలో వ్రాయాలని, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి వారి సందేశాన్ని రికార్డు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు.
ప్రధాన మంత్రి MyGov ఆహ్వానం తాలూకు లింకు ను శేర్ చేస్తూ, ఒక ట్వీట్ లో –
‘‘2022వ సంవత్సరం లో చివరి #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నాడు జరగనుంది. దీనికి గాను మీ సూచనల ను స్వీకరించాలని నేను కుతూహలం తో ఉన్నాను. మీరు మీ ఆలోచనల ను Namo App, MyGov లలో వ్రాయండి, లేదంటే 1800-11-7800 నంబరు కు డయల్ చేసి మీ సందేశాన్ని రికార్డు చేయండంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
2022's last #MannKiBaat will take place on the 25th of this month. I am eager to receive your inputs for the programme. I urge you to write on the NaMo App, MyGov or record your message on 1800-11-7800.https://t.co/W9ef5kQZXj
— Narendra Modi (@narendramodi) December 13, 2022