భారతదేశానికి చెందిన సమృద్ధియుక్త సంగీత పరంపర ను పరిరక్షిస్తున్నటువంటి మరియు ఆ సంప్రదాయం తాలూకు ఉత్సవాన్ని జరుపుకొనేటటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది మన యువతీయువకుల కు మరియు మన సంస్కృతి కి మధ్య గల బంధాన్ని మరింత గాఢం గా చేస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కళా రాంనాథ్ గారి ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ, ఆ ట్వీట్ లో –
‘‘అసాధారణమైన ప్రయాస.. ఇది భారతదేశానికి చెందిన సమృద్ధియుక్త సంగీత పరంపర ను పరిరక్షించాలి అనే భావన యే కాకుండా సమర్పణ భావం కూడాను; అదీ కాక, ఆ సంప్రదాయాన్ని ఒక ఉత్సవం గా జరుపుకోవాలని సైతం ఈ ప్రయాస సూచిస్తున్నది. ఇది మన యువతీయువకుల కు మరియు మన సంస్కృతి కి మధ్య గల బంధాన్ని గాఢతరం గా చేస్తుందన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
Exceptional effort, indicative of the passion and dedication to preserve as well as celebrate India’s rich musical tradition. I am sure it will deepen the connect between our youth and our culture. https://t.co/vwg5pWO0fV
— Narendra Modi (@narendramodi) December 10, 2022