Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డోనీ పోలో విమానాశ్రయాన్ని జోడించడం తో అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటనరంగానికి దన్ను లభిస్తుందని పేర్కొన్న ప్రధాన మంత్రి


ఈటా నగర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని జోడించినందువల్ల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటన రంగం వృద్ధి చెందుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంచనా వేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ఒక వీడియో మాధ్యం ద్వారా ప్రకటించిన ఆకర్షణీయమైన దృశ్యాల ను సైతం ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ పేమా ఖాండూ చేసిన ఒక ట్వీట్ ను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో,

‘‘గొప్ప గా ఉంది. మరి కొత్త విమానాశ్రయం, ఇంకా విమాన సర్వీసులు జతపడినందువల్ల మరింత మంది అరుణాచల్ ప్రదేశ్ ను ఇట్టే సందర్శించ గలుగుతారు. అంతేకాక అక్కడి స్నేహపూర్ణమైనటువంటి ఆతిథ్యం తాలూకు అనుభూతి ని కూడా వారు పొందగలుగుతారు.’’ అని పేర్కొన్నారు.