వినూత్న ఆవిష్కరణలు చేపట్టే భారత యువత సాంకేతికత, ప్రతిభల ప్రపంచీకరణకు వీలుకల్పించారని, ఇండియాలొ,సాంకేతికత అనేది సమానత్వం, సాధికారతకు ఒక శక్తి వంటిదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెక్ సమ్మిట్ను ఉద్దేశించి వీడియో సందేశం ఇస్తూ ఈ మాటలన్నారు. బెంగళూరు సాంకేతికతకు , ఆలోచనాత్మక నాయకత్వానికి నివాసమని, ఇది సమగ్ర, వినూత్న నగరమని ఆయన అన్నారు. చాలా సంవత్సరాలపాటు, బెంగళూరు భారతదేశపు ఆవిష్కరణల ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నదని ఆయన అన్నారు.
భారతదేశపు సాంకేతికత, ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎంతగానో మెప్పించాయని ప్రధానమంత్రి అన్నారు.అయితే వినూత్న ఆవిష్కరణలు చేసే భారత యువత కారణంగా, సాంకేతికత బాగా అందుబాటులోకి వస్తున్నందున భవిష్యత్తు ప్రస్తుతం కంటే ఎంతో ఉజ్వలంగా ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. భారతయువత సాంకేతిక ప్రపంచీకరణకు వీలుకల్పించారని ఆయన అన్నారు. మన ప్రతిభను ప్రపంచం మేలు కోసం వాడుతున్నామని ప్రధానమంత్రి చెప్పారు.
గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్లో ఇండియా 2015లో 81 వ ర్యాంక్ లో ఉండగా ఇప్పుడు 40 వ ర్యాంక్ కు ముందుకు వచ్చిందని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2021 నుంచి యూనికార్న్ స్టార్టప్ల సంఖ్య మన దేశంలో రెట్టింపు అయ్యాయని ఆయన అన్నారు.81,000
గుర్తింపు పొందిన స్టార్టప్లతో ఇండియా మూడవ పెద్ద స్లార్టప్ కేంద్రంగా ఎదిగిందని ప్రధానమంత్రి చెప్పారు. ఇండియాలోని ప్రతిభావంతుల కారణంగా వందలాది
అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో తమ పరిశోధన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం లభించిందని అన్నారు.
భారతదేశంలోని యువతకు టెక్నాలజీ అందుబాటు గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దేశంలో మొబైల్, డాటారంగంలో వస్తున్న విప్లవాత్మక
మార్పుల గురించి ప్రస్తావించారు. గత 8 సంవత్సరాలలో బ్రాడ్ బ్యాండ్ కనక్షన్లు 60 మిలియన్లనుంచి 810 మిలియన్లకు పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు.
స్మార్ట్ ఫోన్ ను వాడే వారి సంఖ్య 150 మిలియన్ల నుంచి 750 మిలియన్లకు పెరిగిందన్నారు.
ఇంటర్నెట్ వృద్ధి పట్టణ ప్రాంతాలలో కన్న గ్రామీణ ప్రాంతాలలో శరవేగంతో ముందుకు పోతున్నదని అంటూ, కొత్తగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇన్ఫర్మేషన్ సూపర్హైవేతో అనుసంధానమవుతున్నారన్నారు.దేశంలో టెక్నాలజీ ప్రజాస్వామీకరణ గురించి ప్రస్తావించారు. సాంకేతికతకు మానవీయ కోణాన్ని జోడించడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇండియాలో టెక్నాలజీ సమానత్వానికి, సాధికారతకు ఒక శక్తి వంటిదని అన్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్సు కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పథకం కింద సుమారు 200 మిలియన్ కుటుంబాలకు అంటే 600 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్యబీమా సదుపాయం లభించిందన్నారు. ఇక కోవిడ్ వాక్సినేషన్ గురించి ప్రస్తావించుకుంటే ప్రపంచంలో టెక్నాలజీ ప్లాట్ఫారం మీదుగా చేపట్టిన భారీ కార్యక్రమంగా ప్రధానమంత్రి దీనిని అభివర్ణించారు. విద్యా రంగం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ఓపెన్ కోర్సులకు సంబంధించి భారీఆన్ లైన్ రిపాజిటరీ ఏర్పాటైందన్నారు. పది మిలియన్ ఉచిత సర్టిఫికేషన్లు జరిగాయన్నారు. దేశంలో అతి తక్కువ
డాటా టారిఫ్లు ఉన్నాయని అంటూ ఇది పేద విద్యార్థులు కోవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతులకు హాజరుకావడానికి దోహదపడిందని చెప్పారు.
పేదరికంపై సాగే యుద్ధంలో టెక్నాలజీని ఒక ఆయుధంగా ఇండియా వాడుతున్నదని ప్రధానమంత్ఇర చెప్పారు. ఇందుకు ఉదాహరణనిస్తూ ప్రధానమంత్రి స్వమిత్వ స్కీమ్కు డ్రోన్లను ఉపయోగించడాన్ని, జన్ధన్ ఆధార్ మొబైల్ అనుసంధానం వంటివి పేదలకు ఎంతో మేలు చేసేవని అన్నారు. స్వమిత్వ పథకం ప్రజల ఆస్తులకు గుర్తింపునిస్తున్నదని, పేదలు తమ ఆస్తి ఆధారంగా రుణాలు పొందడానికి వీలుకలుగుతుందన్నారు. జన్ధన్ ఆధార్ మొబైల్ అనుసంధానం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యక్షనగదు బదిలీకి వెన్నెముకగా నిలుస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కామర్స్ ప్లాట్ఫారం జిఇఎం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. చిన్న వ్యాపారులకు టెక్నాలజీ ఎంతగానో సహాయపడుతున్నదని, పెద్ద కస్టమర్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నదని చెప్పారు. అలాగే అవినీతికి అవకాశం తగ్గిందన్నారు.సాంకేతికతతో ఆన్లైన్ టెండర్ విధానం వచ్చిందని, ఇది ప్రాజెక్టులు వేగవంతం కావడానికి , పారదర్శకత పెరగడానికి వీలు కల్పించింది. ఇది గత ఏడాది ఒక ట్రిలియన్ విలువగల ప్రొక్యూర్మెంట్ లు చేసిందనిన చెప్తూ, జిఇఎం విషయంలో సాధించిన ప్రగతి గురించి వివరించారు.
ఎవరికి వారుగ పనిచేయడం కాక, సమన్వయం అవసరమని అంటూ ప్రధానమంత్రి, ‘‘వినూత్నత ముఖ్యం. సమష్టికృషి దీనికి మరింత శక్తినిస్తుంది. ఎవరికి వారుగా చేసే ప్రయత్నాల కన్న సమష్టిగా చేసే కృషికి శక్తి ఎక్కువ.ఇందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉమ్మడి ప్లాట్ఫాం ఉపయోగించడం వల్ల ఇలాంటి వాటిలో అడ్డంకులు తొలగించవచ్చు’’అని ప్రధానమంత్రి అన్నారు.పి.ఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి రాగల కొద్ది సంవత్సరాలలో ఇండియా 100 ట్రిలియన్లు తయారీ రంగంలో ఖర్చుపెట్టనున్నదని ఆయన అన్నారు. గతిశక్తి ప్లాట్ఫారం ద్వారాకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు, వివిధ విభాగాలు గతిశక్తి ప్లాట్ఫాం ద్వారా పరస్పరం సమన్వయం చేసుకోవచ్చు. వివిధ ప్రాజెక్టులు, భూమి వినియోగం, సంస్థలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి.అందువల్ల ప్రతి స్టేక్ హోల్డర్ ఒకే డాటాను చూడగలుగుతారు. ఇది సమన్వయం కలిగిఉంటుంది. ఎన్నో సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. అనుమతులు, క్లియరెన్సులను ఇది వేగవంతం చేస్తుంది అని తెలియజేశారు.ఇండియాలో పనుల జాప్యానికి కాలం చెల్లిందని ఆంటూ, ఇందుకు చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి వివరించారు. , విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో సంస్కరణలు లేదా డ్రోన్ నిబంధనలలో సంస్కరణలు , సెమి కండక్టర్ రంగంలో,వివిధ రంగాలలో ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు, సులభతర వాణిజ్యం తదితర అంశాలలో ఇండియా అద్భుత చర్యలు తీసుకుందని అన్నారు.ఇన్వెస్టర్లకు అనుకూలమైన ఎన్నో నిర్ణయాలు జరిగాయని అంటూ ప్రధానమంత్రి ‘‘మీ పెట్టుబడి, మా ఆవిష్కరణలు కలిసి ఎన్నో అద్భుతాలు చేయగలవు’’ అని తెలియజేశారు.‘‘మీ విశ్వాసం, మా టెక్నాలజీ ప్రతిభ అన్నింటినీ సుసాధ్యం చేయగలవు. ప్రపంచ సమస్యల పరిష్కారంలో మేం ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న దశలో మాతో కలసి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ’’అని ప్రధానమంత్రి అన్నారు.
PM @narendramodi's video message at Bengaluru Tech Summit. Watch LIVE. https://t.co/mpQgSr1iSo
— PMO India (@PMOIndia) November 16, 2022
India's youth have ensured tech and talent globalisation. pic.twitter.com/qA8lxg3lGo
— PMO India (@PMOIndia) November 16, 2022
India has shown how to democratise technology. pic.twitter.com/5OizTVt79X
— PMO India (@PMOIndia) November 16, 2022
India is using technology as a weapon in the war against poverty. pic.twitter.com/VBTLu00bXa
— PMO India (@PMOIndia) November 16, 2022