Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గణితశాస్త్ర జ్ఞుడు మరియు పద్మ శ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


గణితశాస్త్ర జ్ఞుడు మరియు పద్మ శ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ గారు బహుముఖ వ్యక్తిత్వం కలిగినటువంటి వారే కాక శ్రేష్ఠ విద్వాంసుడు కూడాను.   ఆయన కు గణితశాస్త్ర సంబంధి మరియు విజ్ఞ‌ానశాస్త్ర సంబంధి జ్ఞ‌ాన సంపద  అనుగ్రహం గా ప్రాప్తించింది.  ఆయన భారతదేశం యొక్క సాం స్కృతిక మూలాల ను చూసుకొని ఎంతగానో గర్వించేవారు.  అంతేకాక శ్రీ ఆర్.ఎల్. కశ్యప్ స్వయం గా వైదిక అధ్యయనాల లో పేరెన్నికగన్నారు.  ఆయన ఇక లేరని తెలిసి దు:ఖించాను.  ఆయన కుటుంబాని కి ఇదే సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST