Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌ పునరుత్థాన శక్తిని ఈ స్మృతివనం వివరిస్తుంది: ప్రధానమంత్రి


   రాష్ట్రంలో 2001నాటి భూకంపం ఫలితంగా భుజ్‌లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళి అర్పించేందుకు ప్రజలు స్మృతివనాన్ని సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు గుజరాత్‌ సమాచార శాఖ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఈ దృశ్యం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఈ స్మృతివనం 2001నాటి భూకంపంలో మనం ఎంతోమందిని కోల్పోయిన విషాద ఉదంతానికి నివాళి. ఇది గుజరాత్ పునరుత్థాన శక్తిని విశదీకరిస్తుంది. ఇక రాబోయే నెలలు కచ్‌ని సందర్శించడానికి మంచి తరుణం. అక్కడ రాన్‌ ఉత్సవం జరుగుతుంది. దీనికిప్పుడు భుజ్‌ స్మృతివనం జత కలిసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.