Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసిస్టెంట్ సెక్రట్రి ప్రోగ్రామ్, 2022 యొక్క ముగింపుసమావేశం లో 2020 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల ను ఉద్దేశించి  ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని సుష్మ స్వరాజ్ భవన్ లో జరిగిన అసిస్టెంట్ సెక్రట్రి ప్రోగ్రామ్, 2022 యొక్క ముగింపు సమావేశం లో 2020 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల ను ఉద్దేశించి ఈ రోజు న ప్రసంగించారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అమృత కాలం లో దేశ ప్రజల కు సేవ చేసే మరియు పాంచ్ ప్రణ్ (అయిదు ప్రతిజ్ఞ‌ ల)ను నెరవేర్చడం లో సహాయపడే అవకాశాన్ని అధికారులు దక్కించుకొన్నారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని అమృత కాలం లో సాధించేలా పూచీపడడం లో అధికారుల పాత్ర కీలకం అని ఆయన అన్నారు. మూస కు భిన్నమైనటువంటి ఆలోచనల ను చేయడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, అధికారులు వారి యొక్క ప్రయాసల లో ఒక సంపూర్ణమైనటువంటి విధానాన్ని అవలంబించాలి అని సూచించారు. ఆ తరహా సమగ్ర విధానం తాలూకు ప్రాముఖ్యాన్ని కళ్ల కు కట్టడం కోసం పిఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లాను ను ఒక ఉదాహరణ గా ఆయన పేర్కొన్నారు.

నూతన ఆవిష్కరణ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి చర్చించారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం లో ఒక సామూహిక ప్రయత్నం గాను పని సంస్కృతిగాను ఎలా మారిపోయిందీ ప్రధాన మంత్రి చర్చించారు. స్టార్ట్ అప్ ఇండియా పథకాన్ని గురించి ఆయన మాట్లాడారు. దేశం లో అనేక స్టార్ట్ అప్ స్ గడచిన కొన్ని సంవత్సరాల లో చెప్పుకోదగినటువంటి వృద్ధి ని నమోదు చేసిందీ ఆయన వివరించారు. అనేక మంత్రిత్వ శాఖ లు కలసికట్టుగా ‘సంపూర్ణ ప్రభుత్వం’ వైఖరి తో ఒక జట్టు గా పనిచేసినందువల్ల ఇది సాధ్యపడింది అని ఆయన స్పష్టంచేశారు.

ప్రభుత్వం యొక్క శ్రద్ధ అనేది దిల్లీ వెలుపల కు, దేశం లోని అన్ని ప్రాంతాల కు ఎలాగ మళ్లిందీ ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమైనటువంటి పథకాలు ప్రస్తుతం ఏ రకం గా దిల్లీ కి వెలుపల గల ప్రాంతాల నుండి మొదలవుతోందీ ఆయన కొన్ని ఉదాహరణల ను ఇచ్చారు. అధికారులు వారు పని చేసే ప్రాంతం లో స్థానిక సంస్కృతి ని ఆకళింపు చేసుకోవాలి, క్షేత్ర స్థాయి లో స్థానిక ప్రజానీకం తో వారి సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి అని ప్రధాన మంత్రి సూచన చేశారు. ఒక జిల్లా ఒక ఉత్పాదన పై శ్రద్ధ వహించండి, అలాగే మీ మీ జిల్లా ల యొక్క ఉత్పాదనల ను ఎగుమతి చేయడానికి గల అవకాశాల ను అన్వేషించండి అని వారి తో ఆయన అన్నారు. ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం కోసం వారి యొక్క కార్యాచరణ ప్రణాళిక ను తయారు చేయవలసింది అని కూడా అధికారుల ను ఆయన కోరారు. ఎమ్ జిఎన్ఆర్ఇజిఎ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరింత ప్రభావశీలమైన పద్ధతి లో అమలుపరచడాన్ని గురించి వివరించారు. ప్రజల భాగస్వామ్యం సంబంధి భావన కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి కూడా ఆయన నొక్కిచెప్తూ, ఆహార లోపం వల్ల శుష్కించిపోయే సమస్య ను ఎదిరించి పోరాడడం లో ఒక ముఖ్య పాత్ర ను ఈ వైఖరి పోషించగలుగుతుందన్నారు.

జన్ ధన్ యోజన ఇదివరకు సాధించినటువంటి సాఫల్యాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, డిజిటల్ ఇకానమి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడారు. గ్రామీణ ప్రజల ను డిజిటల్ ఇకానమి తోను, యుపిఐ తోను కలిపేందుకు ప్రయత్నించండి అని అధికారులకు ఉద్బోధించారు. దేశ ప్రజల కు సేవ చేయడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, ఒక వ్యక్తి అతడి యొక్క/ ఆమె యొక్క విధుల ను నిర్వర్తించడానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గురించి ప్రస్తావించారు. ‘రాజ్ పథ్’ తాలూకు మనస్తత్వం ఇక ‘కర్తవ్య పథ్’ తాలూకు భావన వలె మారిపోయింది అని కూడా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం కొనసాగిన క్రమం లో, సహాయక కార్యదర్శులు ప్రధాన మంత్రి సమక్షం లో ఎనిమిది ప్రజెంటేశన్ లను ఇచ్చారు. ఆయా ప్రజెంటేశన్ ల యొక్క విషయాల లో.. పోషణ్ ట్రేకర్: పోషణ్ అభియాన్ ను మెరుగైన రీతి లో పర్యవేక్షించడం కోసం ఉద్దేశించిన ఉపకరణం; భాషిణి మాధ్యమం ద్వారా బహు భాషల లో ధ్వని ఆధారిత డిజిటల్ ఏక్సెస్ ను బలోపేతం చేయడం; కార్పొరేట్ డేటా మేనిజ్ మెంట్; పరిపాలన కోసం భారతదేశం లోని ఏకీకృత‌ రాష్ట్రీయ జియోపోర్టల్ అయినటువంటి ‘మాతృభూమి జియోపోర్టల్’; బార్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ (బిఆర్ఒ) యొక్క పర్యటన సంబంధి సామర్థ్యం; ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) మాధ్యమం ద్వారా తపాలా కార్యాలయాల నుండి లభించే సేవల లో మార్పు ను తీసుకు రావడం; రీఫ్ స్ వంటి కృత్రిమ నిర్మాణాల మాధ్యమం ద్వారా సముద్ర తీర ప్రాంతాల లో మత్స్య పరిశ్రమ ను అభివృద్ధి చేయడం; రాబోయే కాలం కోసం ఉద్దేశించినటువంటి ఇంధనం అయిన కంప్రెస్ డ్ బయోగేస్ వంటివి భాగం గా ఉన్నాయి. ఈ సంవత్సరం లో, 2020 బ్యాచ్ కు చెందిన మొత్తం 175 మంది ఐఎఎస్ అధికారుల ను భారత ప్రభుత్వానికి చెందిన 63 మంత్రిత్వశాఖ లు/విభాగాల లో 11 జులై 2022 నుండి 07 అక్టోబరు 2022 వరకు సహాయక కార్యదర్శి పదవి లో నియమించడమైంది.

***