Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్టులపై పౌర వ్యాఖ్యలకు ప్రధానమంత్రి స్పందన


   హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రాజెక్టులపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి ఇవాళ బదులిచ్చారు. ఈ ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం కోసం ప్రధాని ఆ రాష్ట్రానికి బయల్దేరారు.

   ఇందులో భాగంగా బిలాస్‌పూర్‌లో తాను లోగడ శంకుస్థాపన చేయగా ఇవాళ జాతికి అంకితం చేస్తున్న ‘ఎయిమ్స్‌’ గురించి వివరించారు.

   అదేవిధంగా జాతీయ రహదారి నం.105లో పింజోర్‌-నాలాగఢ్‌ మధ్య 31 కిలోమీటర్ల మేర రూ.1,690 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు గురించి ప్రధాని వెల్లడించారు.

***
DS/AK