ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి
ప్రసంగిస్తూ, 21వ శ తాబ్దంలో భారత దేశం పురోగ తి సాధిస్తున్నప్పుడు, పారిశ్రామిక శిక్షణ సంస్థ కు చెందిన 9 లక్షల మందికి పైగా విద్యార్థుల స్కిల్ స్నాతకోత్స వం సందర్భంగా ఈ రోజు చ రిత్ర సృష్టించడం జరిగిందని, 40 లక్ష ల మందికి పైగా విద్యార్థులు మనతో
వర్చువల్ గా కలిసి ఉన్నారని అన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఆవిష్కరణ బాట లో తొలి అడుగు వేస్తున్నారని ప్ర ధాన మంత్రి పేర్కొన్నారు. “మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, రేపటికి మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను నమ్మకంగా చెప్పగలను” అని ఆయన అన్నారు.
విశ్వకర్మ జయంతి గురించి ప్రధాన మంత్రి
వివరిస్తూ, ఇది గౌరవ ,నైపుణ్యాల ప్రతిష్ఠకు సంబంధించిన పండుగ అని అన్నారు.
ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని తయారు చేయడాన్ని సాదృశ్యంగా చిత్రీకరిస్తూ, ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను గౌరవించడం , గుర్తించడం మనందరికీ గర్వకారణమని ప్రధాని అన్నారు.
“విశ్వకర్మ జయంతి అనేది నిజమైన అర్థంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి గౌరవం, ఇది శ్రమ దినం” అని అంటూ, “భారతదేశంలో, శ్రామికుడి నైపుణ్యంలో భగవంతుడి రూపాన్ని మనం ఎల్లప్పుడూ చూశాము, వారు విశ్వకర్మ రూపంలో కనిపిస్తారు. వారు కలిగి ఉన్న నైపుణ్యంలో ఎక్కడో ఒక చోట దేవుని రూప రేఖ ఉంటుంది. విశ్వకర్మకు ఈ కార్యక్రమం ‘కౌశలాంజలి’ వంటి ఒక భావోద్వేగ నివాళి లాంటిదని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్ళలో ప్రభుత్వం సాధించిన
విజయాలను ప్ర ధాన మంత్రి ప్రస్తావిస్తూ,
విశ్వకర్మ స్ఫూర్తితో భారత దేశం కొత్త పథకాల ను ప్రారంభించిందని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ‘ శ్రమ ఏవ జయతే’ అనే సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు
ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.”ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా
తీర్చిదిద్దడానికి భారత దేశ యువత విద్య తో పాటు నైపుణ్యాలలో కూడా అంతే ప్రావీణ్యం సాధించాలి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. యువత లో నైపుణ్యాల అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని శ్రీ మోదీ అన్నారు. ‘’ మన దేశంలో తొలి ఐటీఐ ని 1950లో ఏర్పాటు చేశారు. తరువాతి ఏడు దశాబ్దాలలో 10 వేల ఐటిఐలు ఏర్పడ్డాయి.
మా ప్రభుత్వం 8 సంవత్సరాలలో దేశంలో సుమారు 5 వేల కొత్త ఐటిఐలను ఏర్పాటు చేసింది. గ త 8 సంవత్సరాలలో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు కూడా ఐటిఐ లకు చేరాయి” అని ప్ర ధాన మంత్రి పేర్కొన్నారు.
జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ , వేలాది నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను కూడా ఐటిఐల తో పాటు దేశ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. పాఠశాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం 5000 కు పైగా స్కిల్ హబ్ లను కూడా తెరవబోతోందని ప్రధాన మంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు చేసిన తరువాత, అనుభవం ఆధారిత అభ్యసనను కూడా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలల్లో నైపుణ్య కోర్సులను ప్రవేశపెడుతున్నారు.
10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత ఐటిఐ కి వచ్చే వారు 12వ క్లియరింగ్ సర్టిఫికేట్ ను
నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా సులువుగా పొందుతారని విద్యార్థులకు తెలియచేయడానికి సంతోషిస్తున్నామని
ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఇది తదుపరి అధ్యయనాలలో మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఐటిఐల నుండి సాంకేతిక శిక్షణ పొందిన యువతను సైన్యంలో
చేర్చుకోవడానికి ఒక ప్రత్యేక సదుపాయం ఉందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.
నాల్గవ పారిశ్రామిక విప్లవ శకం ‘పరిశ్రమ 4.0’ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ,
భారత దేశ విజయంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. కాలానుగుణంగా ఉద్యోగ స్వభావం మారుతోందని, అందువల్ల మన ఐటిఐలలో చదివే విద్యార్థులు కూడా ప్రతి ఆధునిక కోర్సు సౌకర్యాన్ని పొందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆయన చెప్పారు. ఈ కోర్సుల లభ్యత గురించి వివరిస్తూ, ఐటిఐల్లో కోడింగ్ , ఏఐ, రోబోటిక్స్ , 3డీ ప్రింటింగ్ , డ్రోన్ టెక్నాలజీ, టెలి మెడిసిన్ కు సంబంధించిన అనేక కోర్సు లను ప్రారంభించామని శ్రీ మోదీ
వివరించారు. పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్, విద్యుత్ వాహనాల రంగంలో
భారత దేశం ముందంజలో ఉన్నందున అటువంటి రంగాలకు సంబంధించిన కోర్సులు మన అనేక ఐటిఐల లో ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘’మీలాంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించడం సులభం అవుతుంది ‘’ అని ఆయన అన్నారు.
ప్రతి గ్రామానికి ఆప్టిక ల్ ఫైబర్ ను
అందించడం, లక్ష ల కొద్దీ కామన్ స ర్వీస్ సెంటర్ల ను ప్రారంభించడం వంటి
ఇటీవల జరిగిన మార్పుల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దేశంలో సాంకేతిక
పరిజ్ఞానం విస్తరించడం వల్ల ఉద్యోగ
అవకాశా లు కూడా పెరుగుతున్నాయని
ప్రధాన మంత్రి అన్నారు. ఐటిఐల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామాల్లో మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. “ఇది గ్రామంలో మొబైల్ రిపేర్ పని కావచ్చు లేదా వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పని కావచ్చు, ఎరువులను పిచికారీ చేయడం కావచ్చు లేదా డ్రోన్ల సహాయంతో ఔషధాలను సరఫరా చేయడం కావచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇటువంటి అనేక కొత్త ఉద్యోగాలు జోడించబడుతున్నాయి” అని ప్రధాన మంత్రి వివరించారు. “ఇందులో ఐటిఐల పాత్ర చాలా ముఖ్యమైనది, మన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.” ఇదే దార్శనికతను దృష్టిలో పెట్టుకొని ఐటిఐలను అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
నైపుణ్యాల అభివృద్ధితో పాటు, యువతకు సాఫ్ట్ స్కిల్స్ ఉండటం కూడా అంతే ముఖ్యమని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒక వ్యాపార ప్ర ణాళిక ను రూపొందించడం, బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ప్ర ణాళికలు, అవసరమైన ఫారాలను నింపడం, ఒక కొత్త కంపెనీని
రిజిస్టర్ చేసుకోవడం వంటి విషయాలను కోర్సులో భాగంగా కవర్ చేయడం జరిగిందని
శ్రీ మోదీ అన్నారు. “ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాల ఫలితమేమిటంటే, నేడు, భారతదేశం నైపుణ్యాలలో నాణ్యత , వైవిధ్యాన్ని కూడా కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలలో మన ఐటిఐ ఉత్తీర్ణులు
ప్రపంచ నైపుణ్యాల పోటీల్లో ఎన్నో పెద్ద బహుమతులు గెలుచుకున్నారు” అని
ఆయన అన్నారు.
నైపుణ్యాల అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, “ఒక యువతకు విద్యతో పాటు నైపుణ్యాల సామర్ధ్యం కూడా ఉన్నప్పుడు, వారిలో ఆత్మవిశ్వాసం దానంతటగా పెరుగుతుంది. యువత నైపుణ్యాలతో సాధికారత పొందినప్పుడు, స్వయం ఉపాధి స్ఫూర్తికి మద్దతు ఇవ్వడానికి, తన పనిని ఎలా ప్రారంభించాలనే దానిపై ఒక ఆలోచన వస్తుంది’’ అని అన్నారు. ముద్ర యోజన , స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాల ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి
వివరించారు, ఇవి గ్యారెంటీ అవసరం లేకుండా రుణాలు అందిస్తున్నాయి.
“లక్ష్యం ముందుంది, మీరు ఆ దిశలో ముందుకు సాగాలి. ఈ రోజు దేశం మీ చేతిని పట్టుకుంది, రేపు మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని ప్రధాన మంత్రి కోరారు.
ఆజాదీ కా అమృత్ కాల్ గురించి ప్రస్తావిస్తూ, భారత దేశానికి వచ్చే 25 సంవత్సరాల మాదిరి వచ్చే 25 సంవత్సరాలు మన జీవితాలకు కూడా అంతే ముఖ్యమని అన్నారు. ‘మీరంతా మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ ప్రచార సారదులు. మీరు భారత దేశ పరిశ్రమకు వెన్నెముక లాంటి వారు. అందువల్ల అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో మీరు పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది’’ అని ప్రధాన మంత్రి
తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయిలో అవకాశాలను గురించి
ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలకు తమ కలలను సాకారం చేసుకోవడానికి, తమ అభివృద్ధి వేగాన్ని
నిలుపుకోవడానికి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరమని అన్నారు. దేశంతో పాటు విదేశాలతో కూడా ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు. ‘’మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో భారత్ పై ప్రపంచానికి విశ్వాసం నిరంతరం పెరుగుతోంది. కరోనా కాలంలో కూడా, భారతదేశం తన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, దాని యువత అతిపెద్ద సవాళ్లకు పరిష్కారాలను అందించగల సామర్థ్యాన్ని ఎలా కలిగి ఉందో నిరూపించిం ది’’ అన్నారు. ఆరోగ్య సేవలు లేదా హోటల్ – ఆస్పత్రుల
నిర్వహణ , డిజిటల్ పరిష్కారాలు, లేదా విప త్తు నిర్వహణ వంటి వాటి లో భారతీయులు తమ నైపుణ్యాలు ప్ర తిభా సామర్ధ్యాలతో
ప్రతి దేశంలోనూ tతమదైన ముద్ర
వేస్తున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, యువత తమ భవిష్యత్తుకు ఆధారమైన నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేసుకోవలసిన
అవసరాన్ని పునరుద్ఘాటించారు. నైపుణ్యాల విషయానికి వస్తే, ‘స్కిల్లింగ్, రీస్కిల్లింగ్’,’అప్ స్కిల్లింగ్’ మన మంత్రం కావాలని శ్రీ మోదీ అన్నారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, వారి జ్ఞానాన్ని పంచుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. “మీరు ఇదే వేగంతో ముందుకు వెళతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, మీ నైపుణ్యంతో, మీరు నవ భారతదేశ మెరుగైన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలి” అని పిలుపు ఇచ్చారు.
Addressing Kaushal Dikshant Samaroh of ITI. https://t.co/YOkK76UwGw
— Narendra Modi (@narendramodi) September 17, 2022
विश्वकर्मा जयंती, ये कौशल की प्राण प्रतिष्ठा का पर्व है।
जैसे मूर्तिकार कोई मूर्ति बनाता है लेकिन जब तक उसकी प्राण प्रतिष्ठा नहीं होती, वो मूर्ति भगवान का रूप नहीं कहलाती: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
बीते 8 वर्षों में देश ने भगवान विश्वकर्मा की प्रेरणा से नई योजनाएँ शुरू की हैं, ‘श्रम एव जयते’ की अपनी परंपरा को पुनर्जीवित करने के लिए प्रयास किया है।
आज देश एक बार फिर स्किल को सम्मान दे रहा है, स्किल डवलपमेंट पर भी उतना ही जोर दे रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
हमारे देश में पहला ITI, 1950 में बना था। इसके बाद के सात दशकों में 10 हजार ITI’s बने।
हमारी सरकार के 8 वर्षों में देश में करीब-करीब 5 हजार नए ITI’s बनाए गए हैं।
बीते 8 वर्षों में ITI’s में 4 लाख से ज्यादा नई सीटें भी जोड़ी गई हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
स्किल डवलपमेंट के साथ ही, युवाओं में सॉफ्ट स्किल्स का होना भी उतना ही जरूरी है।
ITIs में अब इस पर भी विशेष जोर दिया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
युवा जब स्किल के साथ सशक्त होकर निकलता है, तो उसके मन में ये विचार भी होता है कि कैसे वो अपना काम शुरू करें।
स्वरोजगार की इस भावना को सहयोग देने के लिए, आज आपके पास बिना गारंटी लोन दिलाने वाली मुद्रा योजना, स्टार्टअप इंडिया और स्टैंडअप इंडिया जैसी योजनाओं की ताकत भी है: PM
— PMO India (@PMOIndia) September 17, 2022
आप सभी युवा, ‘मेक इन इंडिया’ और ‘वोकल फॉर लोकल अभियान’ के कर्णधार हैं।
आप भारत के उद्योग जगत की backbone की तरह हैं और इसलिए विकसित भारत के संकल्प को पूरा करने में, आत्मनिर्भर भारत के संकल्प को पूरा करने में, आपकी बड़ी भूमिका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
आपने आज जो सीखा है, वो आपके भविष्य का आधार जरूर बनेगा, लेकिन आपको भविष्य के हिसाब से अपने कौशल को upgrade भी करना पड़ेगा।
इसलिए, बात जब skill की होती है, तो आपका मंत्र होना चाहिए- ‘skilling’, ‘re-skilling’ और ‘up-skilling’: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
*****
DS/TS
***

आप सभी युवा, 'मेक इन इंडिया' और 'वोकल फॉर लोकल अभियान' के कर्णधार हैं।