Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్‌ చుక్‌ తో సమావేశమైన ప్రధాన మంత్రి

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్‌ చుక్‌ తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్‌ చుక్‌ తో సమావేశమయ్యారు.

సన్నిహితమైనటువంటి మరియు అద్వితీయమైనటువంటి భారతదేశం-భూటాన్ మైత్రి ని మరింత గా బలపరచడం కోసం వివిధ ఉపాయాల పై ఉన్నతాధికారులు ఇరువురు చర్చించారు. భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య సంబంధాల ను తీర్చిదిద్దడం లో డ్రుక్ గ్యాల్ పో స్ ద్వారా ఒక పరంపర గా లభించిన మార్గదర్శకప్రాయ దృష్టికోణాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు కూడా ను.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

“భూటాన్ రాజు గారి తో సమావేశం స్నేహపూర్ణమైన వాతావరణం లో జరిగింది. భారతదేశాని కి-భూటాన్ కు మధ్య గల సన్నిహితమైన మరియు విశిష్టమైన మైత్రి ని మరింత బలపరచడం కోసం వివిధ ఉపాయాలపై చర్చించడమైంది. మన సంబంధాల కు రూపురేఖల ను తీర్చిదిద్దడం లో డ్రుక్ గ్యాల్ పో స్ ద్వారా ఒక పరంపర గా లభించిన మార్గదర్శకప్రాయ దృష్టికోణానికి గాను నేను ప్రశంస ను వ్యక్తం చేశాను.’’ అని పేర్కొన్నారు.