Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల తో జరిగిన జాతీయ శ్రమ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల తో జరిగిన జాతీయ శ్రమ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం


నమస్కారం.

చండీగఢ్ పరిపాలకుడు శ్రీ బన్‌ వారీ లాల్ పురోహిత్ గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరులు శ్రీయుతులు భూపేందర్ యాదవ్ గారు, రామేశ్వర్ తేలి గారు లు, అన్ని రాష్ట్రాల కు చెందిన గౌరవనీయ శ్రమ శాఖ మంత్రులు, కార్మిక శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, మహిళ లు మరియు సజ్జనులారా, ముందుగా నేను భగవాన్ తిరుపతి బాలాజీ పాదాల కు ప్రణమిల్లదలచాను. మీరంతా విచ్చేసినటువంటి పవిత్రమైన ప్రదేశం భారతదేశం యొక్క శ్రమ మరియు సామర్థ్యాల కు ఒక సాక్షి గా నిలచింది. ఈ సమావేశం లో వ్యక్తం అయ్యే ఆలోచన లు దేశం లో శ్రమ శక్తి ని తప్పక మరింత గా బలపరుస్తాయి అని నేను భావిస్తున్నాను. నేను మీ అందరికీ ప్రత్యేకించి, శ్రమ మంత్రిత్వ శాఖ కు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అభినందనల ను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

దేశం ఆగస్టు 15వ తేదీ నాడు తన స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని మరీఅమృత కాలంలోకి అడుగు పెట్టింది. అమృత కాలంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దాలన్న మన కలల ను మరియు మన ఆకాంక్షల ను నెరవేర్చుకోవాలి అంటే గనక భారతదేశం యొక్క శ్రమ శక్తి ఒక ప్రధానమైన పాత్ర ను పోషించవలసి ఉంది. ఈ విధమైన ఆలోచన విధానం తో దేశం సంఘటిత రంగం లో మరియు అసంఘటిత రంగం లో కోట్ల కొద్దీ శ్రమికుల కోసం నిరంతరం పని చేస్తున్నది.

ప్రధాన మంత్రి శ్రమ-యోగి మాన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ఇంకా ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ల వంటి వేరు వేరు కార్యక్రమాలు శ్రమికుల కు ఒక రకమైనటువంటి రక్షా కవచాన్ని అందించాయి. ఆ తరహా పథకాల కారణం గా దేశం తాము చేస్తున్న కఠోర శ్రమ ను ఆదరిస్తోందన్న నమ్మకం అసంఘటిత రంగ శ్రమికుల లో ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వాని కి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల కు చెందినటువంటి ఆ తరహా కార్యక్రమాల ను ఎంతో సూక్ష్మ గ్రాహ్యత తో కలగలిపి మనం ముందుకు పోవాలి. అది జరిగినప్పుడు ఆయా కార్యక్రమాల తాలూకు గరిష్ఠ ప్రయోజనాన్ని శ్రమికులు పొందగలుగుతారు.

మిత్రులారా,

దేశం లో ఈ ప్రయాసల తాలూకు ఎంతటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పై ప్రసరించిందో, దీనికి మనం కరోనా కాలం లో సాక్షులం గా ఉన్నాం. ‘ఇమర్జెన్సి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లక్షల కొద్దీ చిన్న పరిశ్రమల కు తోడ్పడింది. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకం దాదాపు గా ఒకటిన్నర కోట్ల మంది ఉద్యోగాల ను కాపాడింది. కరోనా కాలం లో వేల కోట్ల రూపాయల ను ఉద్యోగుల కు ఎడ్వాన్సు గా ఇవ్వడం ద్వారా ఇపిఎఫ్ఒ కూడా వారికి సాయపడింది. మరి మిత్రులారా, దేశం తన శ్రమికుల కు ఆపన్న కాలం లో సమర్ధన ను అందించిన విధం గానే, శ్రమికులు ఈ మహమ్మారి బారి నుంచి తిరిగి పుంజుకోవడం లో వారి యొక్క యావత్తు శక్తి ని ధారపోయడాన్ని మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం భారతదేశం మళ్ళీ ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా మారింది; మరి దీని తాలూకు ఖ్యాతి లో చాలా భాగం మన శ్రమికుల దే అని చెప్పాలి.

మిత్రులారా,

దేశం లో ప్రతి ఒక్క శ్రమికుడి ని, శ్రమికురాలి ని సామాజిక సురక్ష పరిధి లోకి తీసుకు రావడానికి ఏ విధమైనటువంటి కృషి జరుగుతోంది అనే దానికి ఇ-శ్రమ్ పోర్టల్ఒక ఉదాహరణ గా ఉంది. అసంఘటిత రంగం లో శ్రమికుల కు వారి యొక్క ఆధార్ తో ముడిపెట్టినటువంటి ఒక జాతీయ డేటా బేస్ ను రూపొందించడం కోసం ఈ పోర్టల్ ను కిందటి సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది. ఒక సంవత్సర కాలం లోనే 400 రంగాల కు చెందిన దాదాపు 28 కోట్ల మంది శ్రమికుల కు ఈ పోర్టల్ లో వారి వివరాల ను నమోదు చేసుకున్నారు. ఇది ప్రత్యేకించి నిర్మాణ రంగ శ్రమికులు, ప్రవాసీ శ్రమికులు మరియు స్వదేశీ శ్రమికుల కు లబ్ధి ని చేకూర్చింది. ఇక వీరు యూనివర్సల్ అకౌంట్ నంబర్ వంటి సౌకర్యాల తాలూకు లాభాల ను కూడా అందుకొంటున్నారు. ఇ-శ్రమ్ పోర్టల్ను నేశనల్ కెరియర్ సర్వీస్ తోను, అసీమ్ పోర్టల్ తోను, ఉద్యమ్ పోర్టల్ తోను జత పరచి, శ్రమికుల కు ఉద్యోగ అవకాశాల ను మెరుగు పరచే పని జరుగుతున్నది.

రాష్ట్రాల పోర్టల్స్ ను జాతీయ పోర్టల్స్ తో ఏకీకరించవలసింది గా ఈ సమావేశాని కి హాజరు అయిన వారందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. దీనితో దేశం లోని శ్రమికులు అందరికీ కొత్త అవకాశాలు లభించడం తో పాటు రాష్ట్రాలు అన్నీ కూడా ను దేశం లోని శ్రమ శక్తి యొక్క ప్రభావవంతమైనటువంటి ప్రయోజనాల ను పొందగలుగుతాయి.

మిత్రులారా,

బ్రిటిషు పాలన కాలం నుండి అమలు లో ఉన్నటువంటి శ్రమ చట్టాలు మన దేశం లో అనేకం ఉన్నాయన్న సంగతి మీకందరికీ తెలుసును. గడచిన ఎనిమిది సంవత్సరాల లో, మేం దేశం లో బానిసత్వ హయాం లోని, మరియు దాస్య మనస్తత్వాని కి అద్దం పట్టేటటువంటి చట్టాల ను అంతం చేసే చొరవ ను తీసుకొన్నాం. దేశం ఇప్పుడు ఆ కోవ కు చెందిన శ్రమ చట్టాల ను మారుస్తూ, సంస్కరిస్తూ, సరళతరం గా దిద్దితీర్చుతున్నది. ఇదే ఆలోచనల తో, 29 శ్రమ చట్టాల ను నాలుగు సీదా సాదా లేబర్ కోడ్ స్ రూపం లోకి పరివర్తన చేయడమైంది. దీనితో మన శ్రమిక సోదరులు, సోదరీమణులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత , సామాజిక సురక్ష ల తో పాటుగా ఆరోగ్య సురక్ష వంటి అంశాల పై మరింత గా శక్తివంతులు కాగలుగుతారు. అంతర్ రాష్ట్ర ప్రవాసీ శ్రమికుల తాలూకు నిర్వచనాన్ని సైతం సరికొత్త లేబర్ కోడ్ స్ లో మెరుగుపరచడం జరిగింది. వన్ నేశన్, వన్ రేశన్ కార్డ్వంటి పథకం ద్వారా మన ప్రవాసీ శ్రమ రంగం లోని సోదరుల కు మరియు సోదరీమణుల కు ఎంతగానో సాయం అందింది.

మిత్రులారా,

మనం మరొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రపంచం వేగం గా మారిపోతోంది. మనం మనల ను వేగం గా తయారు చేసుకోలేదంటే అప్పుడు వెనుకపట్టుననే మిగిలిపోయే అపాయం పొంచి ఉంటుంది. ఒకటో, రెండో మరియు మూడో పారిశ్రామిక విప్లవాల యొక్క ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడం లో భారతదేశం వెనుకబడింది. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవ తరుణం లో భారతదేశం త్వరిత గతి న నిర్ణయాల ను తీసుకోవడం ఒక్కటే కాక వాటిని అమలు లో పెట్టాలి కూడాను. మారుతున్న కాలాల లో పాటుగా, ఏ విధం గా అయితే ఉద్యోగం యొక్క స్వభావం మారుతూ ఉందో, దానిని మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ఇవాళ ప్రపంచం డిజిటల్ కాలం లోకి ప్రవేశిస్తోంది. యావత్తు ప్రపంచం శర వేగం గా మార్పుల కు లోనవుతున్నది. ప్రస్తుతం మనం గిగ్ మరియు ప్లాట్ ఫార్మ్ ఇకానమీ రూపాల లో ఉపాధి తాలూకు ఒక కొత్త పార్శ్వాని కి సాక్షులు గా నిలచాం. ఆన్ లైన్ శాపింగ్ కావచ్చు, ఆన్ లైన్ హెల్థ్ సర్వీసెస్ కావచ్చు, ఆన్ లైన్ టాక్సీ ఇంకా ఆన్ లైన్ ఫూడ్ డెలివరీ కావచ్చు.. ఇవి ప్రస్తుతం పట్టణ జీవనం లో ఓ భాగం అయిపోయాయి. లక్షల కొద్దీ యువత ఈ సేవల ను, ఈ కొత్త బజారు కు వేగాన్ని జతపరుస్తున్నారు. ఈ నూతన అవకాశాలకై మన సరి అయినటువంటి విధానాలు మరియు సరి అయినటువంటి ప్రయాస లు ఈ రంగం లో భారతదేశాన్ని ఒక గ్లోబల్ లీడర్ గా చేయడం లో సాయపడగలవు.

మిత్రులారా,

దేశ శ్రమ మంత్రిత్వ శాఖ అమృత కాలంలో 2047 వ సంవత్సరం కోసం తనదైన విజన్ ను తయారు చేస్తోంది. భవిష్యత్తు లో సరళతరమైన పని ప్రదేశాలు, ఇంటి నుండే పని చేసేందుకు అనువైన విధానం మరియు సరళతరమైన పని గంటలు అనేవి అవసరమవుతాయి. మనం సరళతరమైన పని ప్రదేశాలు వంటి పద్ధతుల ను మహిళా శ్రమశక్తి యొక్క భాగస్వామ్యానికి వీలు ఉండే అవకాశాలు గా మలచుకోవచ్చును.

ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు ఎర్ర కోట బురుజుల నుండి నేను ప్రసంగిస్తూ, దేశం లో నారీశక్తి యొక్క పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని ఆహ్వానించాను. మహిళల శక్తి ని సరి అయినటువంటి విధం గా వినియోగించుకోవడం ద్వారా భారతదేశం తన లక్ష్యాల ను వేగవంతం గా సాధించ గలుగుతుంది. దేశం లో కొత్త గా ఉనికి లోకి వస్తున్న రంగాల లో మహిళల కు సంబంధించి మరేమైనా చేయగలమా అనే దిశలో కూడాను మనం ఆలోచన చేయవలసి ఉంది.

మిత్రులారా,

ఇరవై ఒకటో శతాబ్ది లో భారతదేశం సాధించేటటువంటి సఫలత అనేది మనకు జనాభా పరం గా ఉన్నటువంటి అనుకూలత ను మనం ఎంత చక్కగా వినియోగించుకొంటాము అనే అంశం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అధిక ప్రతిభ కలిగినటువంటి, చేయి తిరిగిన టువంటి శ్రమశక్తి ని తీర్చి దిద్దడం ద్వారా ప్రపంచం లోని అవకాశాల ను మనం అందిపుచ్చుకోవచ్చును. ప్రపంచం లో అనేక దేశాల తో భారతదేశం ప్రవాసీ భాగస్వామ్య ఒప్పందాల ను మరియు మొబిలిటీ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంటుల ను కుదుర్చుకొంటున్నది. మనం మన ప్రయాసల ను ముమ్మరం చేయవలసి ఉంది. అంతేకాక, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవలసి ఉంది. అదే జరిగితే దేశం లో అన్ని రాష్ట్రాలు ఈ అవకాశాల తాలూకు లాభాన్ని స్వీకరించగలుగుతాయి.

మిత్రులారా,

ఈ రోజు న, ఎప్పుడైతే ఇంత పెద్ద సందర్భం లో మనమంతా ఒక చోట గుమికూడామో, ఈ వేళ నేను అన్ని రాష్ట్రాల కు మరియు మీ అందరి కి ఒక అభ్యర్థన ను చేయదలచుకొన్నానును. అది ఏమిటి అంటే, మన భవనం మరియు నిర్మాణ రంగ శ్రమికులు మన శ్రమ శక్తి లో ఒక విడదీయలేనటువంటి భాగం గా ఉన్నారు అనే సంగతి మీకు ఎరుకే. వారి కోసం ఏర్పాటు చేసినటువంటి సెస్ను పూర్తి గా వినియోగించుకోవడం అవసరం.

ఈ సెస్ లో ఇంచుమించు 38,000 కోట్ల రూపాయల ను ఇప్పటికీ రాష్ట్రాలు వినియోగించుకోలేకపోయాయన్న విషయం నా దృష్టి కి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకం తో ఇఎస్ఐసి కలసి ఏ విధం గా మరింత మంది శ్రమికుల కు లబ్ధి ని చేకూర్చగలదు అనే అంశం పైన కూడా మనం దృష్టి ని సారించవలసి ఉంది.

మన ఈ సామూహిక ప్రయాస లు దేశం యొక్క వాస్తవిక సామర్ధ్యాన్ని ముందుకు తీసుకు రావడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించగలుగుతాయి అని నాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం తోనే మీకందరికీ అనేకానేక ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను. మరి ఈ రెండు రోజుల చర్చ లో మీరు కొత్త సంకల్పాలతో, కొత్త విశ్వాసం తో దేశం లో శ్రమ శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచగలుగుతారన్న నమ్మకం నాలో ఉంది.

అనేకానేక ధన్యవాదాలు.

***