Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాల ను గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టుకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాలు (పురుషుల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు మరియు మహిళల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు, గ్రీకో-రోమన్ లో 2 పతకాలు) గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మన రెస్లర్ లు మనం మరో సారి గర్వించేటట్టు చేశారు. యు20 వరల్డ్ చాంపియన్ శిప్స్ లో 16 పతకాలు (పురుషుల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు మరియు మహిళల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు, గ్రీకో-రోమన్ లో 2 పతకాలు కలుపుకొని) గెలిచిన సందర్భం లో మన జట్టు కు ఇవే అభినందన లు. ఇది భారతదేశం ఇప్పటి వరకు కనబరచినటువంటి సర్వశ్రేష్ఠ ప్రదర్శన గా ఉంది. దీనితో భారతీయ కుస్తీ యొక్క భవిష్యత్తు సురక్షితమైన చేతుల లో ఉందని కూడా తెలుస్తోంది.’’ అని పేర్కొన్నారు.

****