ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇమర్జెన్సి క్రెడిట్ లైన్ గేరంటీ స్కీమ్ (ఇసిఎల్ జిఎస్) యొక్క పరిమితి లో 50,000 కోట్ల రూపాయల మేరకు పెంపుదల ను అనుమతించి దానిని ఇప్పుడు ఉన్నటువంటి 4.5 లక్షల కోట్ల రూపాయల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు గా చేయడానికి ఆమోదాన్ని తెలిపింది. ఈ అదనపు రాశి ని ప్రత్యేకించి ఆతిథ్యం మరియు దానితో సంబంధం గల రంగాల లోని వ్యాపార సంస్థల కోసం నిర్ధారించడమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణం గా ఆతిథ్యం మరియు సంబంధిత వ్యాపార సంస్థల లో తలెత్తిన గంభీర అంతరాయాల ను దృ ష్టి లో పెట్టుకొని, ఈ పెంపుదల నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది.
అమలు తాలూకు ప్రణాళిక:
ఇసిఎల్ జిఎస్ అనేది నిరంతరం గా సాగేటటువంటి ఒక పథకం గా ఉంది. 2 మొత్తం 50,000 కోట్ల రూపాయల మేర ఈ అదనపు సొమ్ము ను ఆతిథ్య రంగం మరియు ఆ రంగం తో సంబంధం గల రంగాల కు చెందినటువంటి వ్యాపార సంస్థల పై వెచ్చించడం జరుగుతుంది. ఈ పథకం యొక్క చెల్లుబాటు అవధి అయినటువంటి 2023 వ సంవత్సరం లో మార్చి నెల 31వ తేదీ లోపలే ఈ డబ్బు ను ఖర్చు చేయడం జరుగుతుంది.
ప్రభావం:
ఇసిఎల్ జిఎస్ ఇంతకు ముందే అమలు లో ఉన్న ఒక పథకం. మరి ఆతిథ్యం, ఇంకా దానితో సంబంధం గల రంగాలలో కోవిడ్-19 మహమ్మారి కారణం గా తలెత్తిన అంతరాయాల వల్ల ప్రభుత్వం విశేషించి ఈ రంగాల తో ముడిపడివున్న వ్యాపార సంస్థల కోసం అంటూ 50,000 కోట్ల రూపాయల రాశి ని నిర్ధారించడం జరిగింది. ఈ పెంపుదల ద్వారా, రుణాల ను అందించే సంస్థలకు ఈ రంగాల లోని వ్యాపార సంస్థల కు తక్కువ ఖర్చు తో 50,000 కోట్ల రూపాయల వరకు అదనంగా రుణాల ను ఇచ్చే దిశ లో ప్రోత్సహించి ఈ వ్యాపార సంస్థలకు వాటి కార్యనిర్వహణ పరమైన బాధ్యతల ను నెరవేర్చుకోవడానికి, వాటి వ్యాపారాల ను కొనసాగించుకోవడానికి వీలు ను కల్పించడం తో వాటి కి ఊరట లభిస్తుందన్న ఆశ ఉంది.
ఇసిఎల్ జిఎస్ లో భాగం గా 2022వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ నాటికి ఇంచుమించు 3.67 లక్షల కోట్ల రూపాయల రుణాల ను మంజూరు చేయడమైంది.
పూర్వరంగం:
ఇప్పటికీ రూపు మాయని మహమ్మారి, మరీ ముఖ్యం గా ఆతిథ్య రంగంపై, తత్సంబంధిత రంగాల పై చాలా గంభీరమైన ప్రతికూల ప్రభావాన్ని ప్రసరింపచేసింది. ఇతర రంగాలు తిరిగి త్వరిత గతి న పుంజుకోగా, ఈ రంగాల కు మాత్రం దీర్ఘకాలం గా డిమాండు మందకొడి గా కొనసాగుతోంది. ఆతిథ్యం, సంబంధి రంగాలు తిరిగి నిలదొక్కుకోవాలి అంటే గనుక యోగ్యమైన జోక్యాల అవసరం ఎంతైనా ఉందన్న స్థితి ని ఈ పరిణామం సూచిస్తున్నది. అంతేకాక ఈ రంగాల కు ఇతర రంగాల తో ప్రత్యక్ష సంబంధాలు మరియు పరోక్ష సంబంధాలు ఉన్నందువల్లనూ, ఈ రంగాల లో అధిక ఉపాధి కి అవకాశాలు ఉన్నందువల్లనూ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద మళ్ళీ పుంజుకోవాలి అంటే అందుకు ఈ రంగాలు బలోపేతం కావడం కూడా ఎంతో అవసరం. దీనిని గుర్తించి, 2022-23 కేంద్ర బడ్జెటు లో ఇసిఎల్ జిఎస్ యొక్క చెల్లుబాటు ను 2023వ సంవత్సరం మార్చి నెల చివరి వరకు పొడిగించాలి అని, మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల ఇసిఎల్ జిఎస్ పూచీకత్తు రక్షణ ను ఇవ్వడం కోసం మరో 50,000 కోట్ల రూపాయల సాయాన్ని ఇవ్వాలని ప్రకటించడమైంది. అదనపు రాశి ని విశేషించి ఆతిథ్య రంగం, ఆ రంగం తో ముడిపడ్డ రంగాల లోని వ్యాపార సంస్థల కు కేటాయించడమైంది.
ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని ముమ్మర స్థాయి లో అమలు చేస్తుండడం, ఆంక్షల ను క్రమానుగతం గా తిరిగి వెనుకకు తీసుకోవడం, ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద మెరుగుపడుతూ ఉండడం అనేవి ఈ రంగాల లో సైతం డిమాండు క్రమేపీ వృద్ధి చెందేందుకు అనువైన స్థితిగతుల ను ఏర్పరచాయి. ఈ అదనపు పూచీకత్తు తాలూకు రక్షణ అనేది ఈ రంగాలు శీఘ్రం గా కోలుకోవడానికి కూడా సాయపడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
***