ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు ప్రసారం కానున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు భావి ఎపిసోడ్ కు గాను ప్రజల ను వారి వారి ఆలోచనల ను, ఇన్ పుట్ లను వెల్లడించలసింది గా ఆహ్వానించారు. ఆలోచనల ను MyGov వెబ్ సైట్ ద్వారా లేదా Namo ఏప్ ద్వారా శేర్ చేయవచ్చును; లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి సందేశాల ను రికార్డు చేయవచ్చును.
MyGov యొక్క ఆహ్వానాన్ని శేర్ చేస్తూ, ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘ఆగస్టు 28వ తేదీ న ప్రసారం అయ్యేటటువంటి #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనలు మరియు ఇన్ పుట్ ల కోసం ఎదురుచూస్తున్నాను. మీ ఆలోచనల ను MyGov లేదా NaMo ఏప్ లో రాయగలరు. వీటి కి ప్రత్యామ్నాయం గా, 1800-11-7800 కు డయల్ చేసి మీ యొక్క సందేశాలను రికార్డు చేయవచ్చును.’’ అని పేర్కొన్నారు.
Looking forward to ideas and inputs for the upcoming #MannKiBaat programme on 28th August. Write on MyGov or the NaMo App. Alternatively, record a message by dialling 1800-11-7800. https://t.co/7Dbx87p1up
— Narendra Modi (@narendramodi) August 17, 2022