బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన పూజా సిహాగ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“ప్రతిభావంతురాలైన కుస్తీ క్రీడాకారిణిగా పూజా సిహాగ్ తననుతాను రుజువు చేసుకున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందడుగు వేసిన ఆమె ఆత్మవిశ్వాసం ప్రశంసననీయం. కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నందుకు అభినందనలు. ఆమె మరిన్ని విజయాలు సాధించి భవిష్యత్తులోనూ మన దేశం గర్వించేలా చేయగలదన్న విశ్వాసం నాకుంది. #Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Pooja Sihag has made a mark for herself as a talented wrestler. She has overcome many challenges thanks to her never say die attitude. She has won a Bronze at the CWG 2022. Congratulations to her. I am confident she will keep making India proud in the times to come. #Cheer4India pic.twitter.com/SraRDk2t2L
— Narendra Modi (@narendramodi) August 7, 2022