Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్,  ధరంపుర్ లో వివిధ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి

గుజరాత్ లోని శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్,  ధరంపుర్ లో వివిధ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి


గుజరాత్ లోని వల్ సాడ్ జిల్లా లో శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్, ధరంపుర్ కు చెందిన వివిధ ప్రాజెక్టుల లో కొన్నిటిని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించడం తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆసుపత్రి పథకాలు అనేవి సమాజం లో మహిళల కు మరియు ఇతర ఆపన్న వర్గాల కు గొప్ప సేవ ను అందించేవి గా నిరూపణ కాగలవని పేర్కొన్నారు. శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్ అందిస్తున్న నిశ్శబ్ద సేవ భావన ను ఆయన పొగడారు.

ఈ మిశన్ తో ఎంతో కాలం గా తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, వారి యొక్క సేవ ను ప్రశంసించి, ఈ విధమైనటువంటి కర్తవ్య పరాయణత్వ భావన అనేదిఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకొంటున్న కాలం లో తక్షణావసరం అని పేర్కొన్నారు. గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాల లో ఆరోగ్య సంరక్షణ రంగం లో పూజ్య గురుదేవుల నాయకత్వం లో శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్ చేసినటువంటి ప్రశంసనీయ కార్యాల పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదల కు సేవ చేయాలి అనేటటువంటి ఈ మిశన్ యొక్క వచన బద్ధత నూతన ఆసుపత్రి ద్వారా బలోపేతం అయిందని ఆయన అన్నారు. తక్కువ ఖర్చు లో నాణ్యమైనటువంటి ఆరోగ్య సంరక్షణ ను ఈ ఆసుపత్రి మరియు పరిశోధన కేంద్రం అందరికీ అందుబాటు లోకి తీసుకు వస్తాయి. ‘‘ఇది అమృత కాలంలో ఒక ఆరోగ్యవంతమైన భారతదేశం అనే దృష్టికోణాని కి శక్తి ని సంతరించనుంది. ఇది ఆరోగ్య సంరక్షణ రంగం లో సబ్ కా ప్రయాస్’ (అందరి కృ షి) అనే భావన ను కూడా బలపరుస్తుంది’’, అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘భారతదేశాన్ని బానిసత్వం బారి నుంచి బయట కు తీసుకు రావడం కోసం పాటుపడ్డ తన సంతానాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కాలం లో, దేశ ప్రజలు స్మరించుకొంటున్నారు. శ్రీమద్ రాజ్ చంద్ర గారు వంటి ఒక రుషి యొక్క ఘనమైన తోడ్పాటు ఈ దేశ చరిత్ర లో ఒక భాగం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. శ్రీ రాజ్ చంద్ర జీ అంటే గాంధీ మహాత్ముని కి ఎంత అభిమానం ఉండేదో కూడా ఆయన ఈ సందర్భం లో వివరించారు. శ్రీమద్ పక్షాన అనేక కార్యాల ను కొనసాగిస్తూ ఉన్నందుకు శ్రీ రాకేశ్ గారి కి ప్రధాన మంత్రి తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

మహిళల కు, ఆదివాసుల కు మరియు ఆదరణ కు నోచుకోకుండా దూరంగా ఉండిపోయినటువంటి వర్గాల కు సాధికారిత ను కల్పించడం కోసం తమ జీవితాల ను అంకితం చేసినటువంటి వ్యక్తులు దేశ చైతన్యాన్ని హుషారు గా ఉంచుతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫార్ విమెన్ ను స్థాపించే క్రమం లో ఒక పెద్ద అడుగు ను వేయడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, విద్య ద్వారా, నైపుణ్యాల ద్వారా కుమార్తె ల సశక్తీకరణ జరగాలి అని శ్రీమద్ రాజ్ చంద్ర గారు గట్టి గా చెప్పే వారు అన్నారు. చాలా చిన్న వయస్సు లోనే మహిళల సశక్తీకరణ కల్పన అనే విషయమై శ్రీమద్ గారు ఎంతో చిత్తశుద్ధి తో మాట్లాడే వారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం లో దేశం లో మహిళా శక్తి ని జాతీయ శక్తి రూపం లో ముందు వరుస లోకి తీసుకు రావడం అనేది మన అందరి మీద ఉన్నటువంటి బాధ్యత అని ప్రధాన మంత్రి అన్నారు.

సోదరీమణులు మరియు పుత్రికలు వారి జీవితాల లో ముందంజ వేయడం లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క అడ్డంకి ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం ప్రస్తుతం అమలుపరుస్తున్న ఆరోగ్య విధానం మన చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవి యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకొంటున్నదని కూడా ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ఒక్క మానవుల కోసమే కాక పశువుల కోసం కూడాను జాతీయ స్థాయి టీకాకరణ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు.

ప్రాజెక్టు ను గురించి

వల్ సాడ్ లోని ధరంపుర్ లో శ్రీమద్ రాజ్ చంద్ర ఆసుపత్రి యొక్క ప్రాజెక్టు వ్యయం సుమారు 200 కోట్ల రూపాయలు. అది 250 పడకల సామర్థ్యం కలిగిన మల్టి స్పెశాలిటి హాస్పిటల్. దాని లో అత్యధునాతనమైనటువంటి వైద్య సంబంధి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలు ప్రపంచ శ్రేణి తృతీయ స్థాయి వైద్య చికిత్సల ను అందించగలవు; ప్రత్యేకించి గుజరాత్ లోని దక్షిణ ప్రాంత ప్రజల కు ఆ ఆసుపత్రి వల్ల ప్రయోజనం సిద్ధించనుంది.

శ్రీమద్ రాజ్ చంద్ర ఏనిమల్ హాస్పిటల్ ను 150 పడకల సదుపాయం కలిగివుండేదిగా తీర్చిదిద్దేందుకు ఇంచుమించు 70 కోట్ల రూపాయల వ్యయం తో దీనిని నిర్మించడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి కి అగ్ర శ్రేణి సదుపాయాల ను సమకూర్చడం తో పాటుగా పశు వైద్యులు మరియు అనుబంధ సిబ్బంది తో కూడిన ఒక జట్టు ను ప్రత్యేకం గా నియమించనున్నారు. ఈ ఆసుపత్రి పశువుల పోషణ కు మరియు సంరక్షణ కు అటు సాంప్రదాయిక వైద్యాన్ని, ఇటు సమగ్రమైన చికిత్సల ను కూడా అందిస్తుంది.

శ్రీమద్ రాజ్ చంద్ర సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫార్ విమెన్ ను 40 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. దీనిలో వినోద కార్యక్రమాల కు ఉద్దేశించిన సదుపాయాలు, స్వీయ వికాసం సంబంధి సమావేశాల కు తరగతి గదులు, విశ్రాంతి ప్రదేశాలు ఉంటాయి. దీనిలో 700కు పైగా ఆదివాసి మహిళల ను నియమించుకోవడం జరుగుతుంది; అంతేకాక తరువాత తరువాత ఈ కేంద్రం వేల మంది కి ఉపాధి ని అందిస్తుంది.

***

DS/AK/TS