Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సముద్ర యాత్రికులకు సర్టిఫికెట్ ల పరస్పర గుర్తింపు అంశంపై భారతదేశానికి, కొరియాకు మధ్య అండర్ టేకింగ్ కు మంత్రివర్గం ఆమోదం


సర్టిఫికెట్ ల పరస్పర గుర్తింపు అంశంపై భారతదేశానికి, కొరియాకు మధ్య ఒక అండర్ టేకింగ్ పై సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఇది ఇంటర్ నేషనల్ కన్ వెన్షన్ ఆన్ స్టాండర్డ్ స్ ఆఫ్ ట్రయినింగ్, సర్టిఫికేషన్ అండ్ వాచ్ కీపింగ్ (ఎస్ టి సి డబ్ల్యు) ఫర్ సీ ఫేరర్స్, 1978 కి సంబంధించిన సవరించిన రెగ్యులేషన్ 1/10 కు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం.

అండర్ టేకింగ్ పై సంతకాలు జరిగితే సముద్ర యాత్రికులకు ఇతర దేశపు ప్రభుత్వం జారీ చేసిన సముద్ర సంబంధి విద్య, శిక్షణ, కాంపెటెన్సీ సర్టిఫికెట్ లు, ఎండార్స్ మెంట్ లు, ట్రయినింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఇంకా వైద్య అర్హత ధ్రువపత్రాల గుర్తింపునకు మార్గం సుగమం కాగలదు. ఎస్ టి సి డబ్ల్యు కన్ వెన్షన్ యొక్క రెగ్యులేషన్ 1/10 కు, సముద్ర యాత్రికుల శిక్షణ, ధ్రువపత్రాల జారీ, నిర్వహణ లలో రెండు దేశాల మధ్య ఉన్న సహకారానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.