ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాంజిట్ కారిడార్ ప్రాజెక్టు కు చెందిన ప్రధాన సొరంగాన్ని మరియు అయిదు అండర్ పాస్ లను జూన్ 19వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ సందర్భం లో ఆయన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాంజిట్ కారిడార్ ప్రాజెక్టు ప్రగతి మైదాన్ పునరభివృద్ధి పథకం లో నుంచి విడదీయలేనటువంటి ఒక భాగం గా ఉన్నది.
పూర్తి గా కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధుల తో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు ను 920 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో నిర్మించడం జరిగింది. ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక నూతనమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన మరియు సమావేశ కేంద్రం వరకు సాఫీ గాను మరియు ఎటువంటి ఇక్కట్టుల ను ఎదుర్కోకుండాను చేరుకొనేందుకు దోహదపడడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యంగా ఉంది. అది జరిగితే, ప్రగతి మైదాన్ లో నిర్వహించే కార్యక్రమాల లో ప్రదర్శనదారు సంస్థ లు మరియు ఆగంతుకులు సులభం గా పాలుపంచుకొనేందుకు వీలు ఉంటుంది.
ఏమైనా, ఈ ప్రాజెక్టు యొక్క ప్రభావం ప్రగతి మైదాన్ కే పరిమితం కాబోదు. ఎందుకంటే ఇది వాహనాల రాకపోకల కు అంతరాయాల ను తొలగించడంతో పాటు, తద్ద్వారా వాహనదారుల కు కాలం మరియు రాకపోకల కు అయ్యే ఖర్చు ను చాలావరకు ఆదా చేసుకోవడం లో సహాయం లభించగలదు. ఇది పట్టణ ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన తీరుతెన్నుల ను మార్చివేయడం ద్వారా ప్రజల కు జీవన సౌలభ్యాన్ని కలుగజేయాలన్న ప్రభుత్వ దూరదర్శి ప్రణాళిక లో ఒక భాగం గా ఉంది.
ప్రధాన సొరంగం ప్రగతి మైదాన్ గుండా సాగేటటువంటి పాత కిలా రోడ్ మీదుగా రింగు రోడ్డు ను ఇండియా గేట్ తో కలుపుతుంది. ఆరు దోవలు గా విభాజితం అయినటువంటి ఈ సొరంగానికి బహుళ లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల లో ప్రగతి మైదాన్ యొక్క విశాలమైనటువంటి బేస్ మెంట్ పార్కింగ్ ను అందుబాటు లోకి తీసుకు రావడం కూడా ఒకటిగా ఉంది. వాహనాల ను నిలిపి ఉంచే స్థలాని కి ఇరు పక్కల వాహనాల రాకపోకల ను సౌకర్యవంతం గా చేయడం కోసమని సొరంగ మార్గాని కి అడుగు న రెండు క్రాస్ టనల్స్ ను కూడా నిర్మించడం ఈ సొరంగం లో ఓ విశిష్టత గా ఉంది. సొరంగం లోపల స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, ఆధునిక వాయు ప్రసరణ వ్యవస్థ, ఆటోమేటెడ్ డ్రైనేజి, డిజిటల్ మాధ్యమం ద్వారా నియంత్రణ జరిగేటటువంటి సిసిటివి మరియు సార్వజనిక ప్రకటన వ్యవస్థ ల వంటి రాకపోకలను సునాయాసం చేయగల నవీనతమ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగివుండేటటువంటి సదుపాయాల ను జతపరచడమైంది. దీర్ఘకాలం గా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సొరంగం భైరోం మార్గ్ కు ఒక ప్రత్యామ్నాయమైన దారి గా సేవల ను అందించనుంది. ప్రస్తుతం భైరోం మార్గ్ పైన దాని రాక పోక ల సామర్ధ్యాని కి మించి చాలా అధికమైన ఒత్తిడి పడుతోంది; మరి ఈ కొత్త దోవ అందుబాటులోకి వస్తే భైరోం మార్గ్ పైన నడిచే సరకు రవాణా వాహనాల తాలూకు భారం అనేది సగానికి పైగానే తగ్గిపోవచ్చన్న అంచనా ఉంది.
ఈ సొరంగం తో పాటుగా ఆరు అండర్ పాస్ లు కూడా ఉన్నాయి; వాటిలో నాలుగు అండర్ పాస్ లు మధుర రహదారి లోను, ఒకటి భైరోం మార్గ్ లోను ఉంటే, మిగతా అండర్ పాస్ రింగు రోడ్డు మరియు భైరోం మార్గ్ ల చౌరస్తా లో ఉంది.
***