బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లోగల మహాపరినిర్వాణ స్తూపం వద్ద ప్రార్థన చేశారు. అంతకుముందు ఈ తెల్లవారుజామున నేపాల్‌లోని బుద్ధుని జన్మస్థలం లుంబినీని సందర్శించిన ప్రధాని అక్కడి మాయాదేవి ఆలయంలోనూ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా లుంబినీ సాధువులకు సంబంధించిన ప్రదేశంలో భారత అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి-వారసత్వ కేంద్రం నిర్మాణ సూచకంగా ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సంయుక్తంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా నేపాల్ ప్రధానమంత్రితో కలసి లుంబినీలోని అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలలోనూ శ్రీ మోదీ పాల్గొన్నారు.
కాగా, కుషీనగర్‌లో మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“కుషీనగర్‌లోని మహా పరినిర్వాణ స్తూపం వద్ద ప్రార్థన చేశాను. ఈ ప్రదేశాన్ని మరింత మంది పర్యాటకులు, యాత్రికులు సందర్శించే విధంగా కుషీనగర్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది” అని ప్రధాని పేర్కొన్నారు.
Prayed at the Mahaparinirvana Stupa in Kushinagar. Our Government is making numerous efforts to boost infrastructure in Kushinagar so that more tourists and pilgrims can come here. pic.twitter.com/lWWFq8HCqs
— Narendra Modi (@narendramodi) May 16, 2022