Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోపెన్‌హాగన్‌ లోని భారతీయ సమాజంతో సంభాషించిన – ప్రధానమంత్రి

కోపెన్‌హాగన్‌ లోని భారతీయ సమాజంతో సంభాషించిన – ప్రధానమంత్రి


 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీమతి మెట్టె ఫ్రెడరిక్‌సెన్, కోపెన్‌హాగన్‌లోని బెల్లా సెంటర్‌ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, వారితో సంభాషించారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులు, వ్యాపారవేత్తలతో కూడిన డెన్మార్క్‌ లోని భారతీయ సమాజానికి చెందిన సుమారు 1000 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

 

భారతీయుల పట్ల ప్రధాన మంత్రి ఫ్రెడరిక్‌సెన్‌ ప్రదర్శిస్తున్న ఆప్యాయత, గౌరవాలను భారత ప్రధానమంత్రి ప్రశంసించారు.  హరిత వృద్ధికి వినూత్న పరిష్కారాలను కనుగొనడంలో ఇరు దేశాలు కలిసి పనిచేయగలవని ఉద్ఘాటించారు.  డెన్మార్క్‌ లో భారతీయ సమాజం పోషించిన సానుకూల పాత్రను ఆయన కొనియాడారు.  భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు.  మరిన్ని భారత-డెన్మార్క్ భాగస్వామ్య సంస్థలు నెలకొల్పాలని ఆయన ఆహ్వానించారు. 

 

 

*****