Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హనుమాన్ జీ యొక్క 108 అడుగుల ఎత్తయినవిగ్రహాన్ని మోర్ బీ లో ఏప్రిల్ 16వ తేదీ న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి


హనుమాన్ జయంతి సందర్భం లో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ జీ యొక్క విగ్రహాన్ని గుజరాత్ లోని మోర్బి లో 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 16వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించనున్నారు.

ఈ విగ్రహం #Hanumanji4dham ప్రాజెక్టు లో భాగం గా దేశం లో నాలుగు దిక్కుల లోనూ ఏర్పాటు చేస్తున్నటువంటి 4 విగ్రహాల లో రెండో విగ్రహం. ఈ విగ్రహాన్ని పశ్చిమ దిక్కు న మోర్ బీ లో పరమ పూజ్య బాపూ కేశవానంద్ జీ యొక్క ఆశ్రమం లో ఏర్పాటు చేయడమైంది.

ఈ వరుస లో హనుమాన్ జీ కి చెందిన ఒకటో విగ్రహాన్ని ఉత్తర దిక్కు న శిమ్ లా లో 2010వ సంవత్సరం లో నెలకొల్పడం జరిగింది. దక్షిణ దిక్కు న రామేశ్వరం లో హనుమాన్ జీ యొక్క విగ్రహం ఏర్పాటు తాలూకు పనుల ను ఈ సరికే ఆరంభించడమైంది.

 

***