రాబోయే ‘ మన్ కీ బాత్ ’ ( ‘ మనసు లో మాట ’ ) కార్యక్రమాని కి ప్రజలు వారు ముఖ్యమైనవి గా భావిస్తున్నటువంటి అంశాల పై వారి యొక్క అభిప్రాయాల ను తన దృష్టి కి తీసుకు రావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయా ఆలోచనల ను మైగవ్ ( MyGov ) , నమో ఏప్ ( Namo App ) ల ద్వారా వెల్లడి చేయవచ్చును; లేదా 1800-11-7800 కు డయల్ చేసి వారి యొక్క సందేశాన్ని రికార్డు చేయించుకొనేందుకు కూడా వీలు ఉంది.
‘ మన్ కీ బాత్ ’ ( ‘ మనసు లో మాట ’ ) కార్యక్రమం యొక్క 88వ భాగం 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 24వ తేదీ నాడు ప్రసారం కానుంది.
మైగవ్ ( MyGov ) ఆహ్వానాన్ని గురించి తెలియజేస్తూ ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘క్షేత్ర స్థాయి లో పరివర్తన కు కారకులు అయినటువంటి వ్యక్తుల అసాధారణమైన కార్యాల ను #MannKiBaat ( ‘ మనసు లో మాట ’ ) మాధ్యమం ద్వారా మనం అభినందిస్తూ వస్తున్నాం. ఆ కోవ కు చెందిన ప్రేరణాత్మక జీవన యాత్రల ను గురించి మీకు తెలుసా? వాటిని ఈ నెల 24వ తేదీ నాటి కార్యక్రమం కోసం వెల్లడి చేయండి. వాటిని గురించి మైగవ్ ( MyGov ), నమో ఏప్ ( Namo App ) లకు రాయండి లేదా మీ యొక్క సందేశాన్ని రికార్డు చేయడం కోసం 1800-11-7800 కు డయల్ చేయగలరు.’’ అని పేర్కొన్నారు.
Through #MannKiBaat we celebrate the extraordinary feats of grassroots level change-makers. Do you know of such inspiring life journeys? Share them for this month’s programme on the 24th. Write on MyGov, NaMo App or dial 1800-11-7800 to record a message. https://t.co/z0uOm3WcTL
— Narendra Modi (@narendramodi) April 8, 2022
***
DS/ST