Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్వాడ్  నేతల వర్చువల్  సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి 


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఇంకా జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా లతో పాటు క్వాడ్ నేతల తో ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొన్నారు.

ఈ సమావేశం లో 2021వ సంవత్సరం సెప్టెంబరు లో క్వాడ్ సమిట్ జరిగిన నాటి నుంచి క్వాడ్ సంబంధిత కార్యక్రమాల లో చోటు చేసుకొన్న పురోగతి ని సమీక్షించడమైంది. ఈ సంవత్సరం చివరర్లో జపాన్ లో శిఖర సమ్మేళనం జరిగే సమయాని కల్లా నిర్దిష్ట ఫలితాల ను సాధించాలన్న ఉద్దేశ్యం తో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలనే విషయం పైన నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతం లో శాంతి ని, స్థిరత్వాన్ని, సమృద్ధి ని పెంచి పోషించాలన్న తన ముఖ్య లక్ష్యం పైన క్వాడ్ తప్పక శ్రద్ధ వహించాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మానవీయ సహాయం, ఇంకా విపత్తుల వేళ లో ఉపశమనకారి చర్యలు, డెడ్ సస్ టేనబులిటి, సరఫరా వ్యవస్థ లు, స్వచ్ఛ శక్తి, సంధానం, ఇంకా కెపాసిటీ-బిల్డింగ్ ల వంటి రంగాల లో క్వాడ్ దేశాలన్నిటి మధ్య పరస్పర సహకారం అనేది నిర్ధిష్టమైనటువంటి మరియు ఆచరణీయమైనటువంటి స్వరూపం లో కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు.

యూక్రేన్ లోని పరిణామాల ను గురించి, యూక్రేన్ లో మానవీయ సంక్షోభం తలెత్తడాన్ని గురించి సమావేశం లో చర్చించడం జరిగింది. చర్చ, ఇంకా దౌత్యం ల మార్గానికి తిరిగి రావలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

నేత లు నైరుతి ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతం మరియు పసిఫిక్ దీవుల లోని స్థితి సహా ఇతర సందర్భోచిత అంశాలపైన కూడా చర్చించారు. ఐక్య రాజ్య సమితి ప్రణాళిక ను, అంతర్జాతీయ చట్టాలను పాలించడం తో పాటు సార్వభౌమత్వాని కి, ఇంకా ప్రాదేశిక అఖండత్వాని కి కట్టుబడి ఉండటానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంది అంటూ ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

నేత లు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని, జపాన్ లో జరుగబోయే శిఖర సమ్మేళనం కోసం మహత్వాకాంక్షభరిత చర్చాంశాల జాబితా ను రూపొందించే దిశ లో కృషి చేయాలని అంగీకారానికి వచ్చారు.

***