అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవాలు.. 36వ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యోదయ భూమిగా 50 ఏళ్లనుంచీ తమకున్న గుర్తింపును మరింత బలోపేతం చేసుకున్నారంటూ ఆయన వారిని అభినందించారు. ప్రముఖ గాయకుడు… భారతరత్న… డాక్టర్ భూపేన్ హజారికా ఆలపించిన ప్రసిద్ధ గీతం ‘అరుణాచల్ హమారా’ నుంచి కొన్ని పంక్తులను కూడా ఉటంకించారు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవాలు… 36వ రాష్ట్రావిర్భావ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు.
దేశభక్తిని, సామాజిక సామరస్య భావనను ప్రోది చేయడం సహా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అరుణాచల్ ప్రదేశ్ పరిరక్షిస్తున్నదని ప్రధాని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని అమరవీరులకు ఆయన నివాళి అలర్పించారు. “అది ఆంగ్లో-అబోర్ యుద్ధం కావచ్చు లేదా స్వాతంత్ర్యం తర్వాత సరిహద్దు భద్రత కావచ్చు.. అరుణాచల్ ప్రజల శౌర్య పరాక్రమ గాథలు ప్రతి భారతీయుడికీ అమూల్య వారసత్వం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో తాను పలుమార్లు పర్యటించడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ నాయకత్వంలోని జంట ఇంజన్ల ప్రభుత్వ హయాంలో ప్రగతి వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” మార్గమే అరుణాచల్ ప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది” అన్నారు.
తూర్పు భారతదేశం… ప్రత్యేకించి ఈశాన్య భారతం 21 వ శతాబ్దంలో భారతదేశ ప్రగతికి చోదకశక్తి కాగలదన్న తన విశ్వాసాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఏడేళ్లుగా తాము చేపట్టిన చర్యల గురించి కూడా ఆయన వివరించారు. అనుసంధానం, విద్యుత్ మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తృత కార్యక్రమాలు సాగుతున్నాయని చెప్పారు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లో జీవన సౌలభ్యంతోపాటు వ్యాపార సౌలభ్యం సాధ్యం కాగలదన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని రాజధానులూ ప్రాధాన్యం ప్రాతిపదికన రైలు-సంధానం అవుతున్నాయని తెలిపారు. “తూర్పు ఆసియాకు ఒక ప్రధాన ముఖద్వారంగా అరుణాచల్‌ను తీర్చిదిద్దడానికి మేం శాయశక్తులా కృషి చేస్తున్నాం. అరుణాచల్‌కు గల వ్యూహాత్మక పాత్ర దృష్ట్యా రాష్ట్రంలో ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టబడింది” అని ప్రధాని చెప్పారు.
ప్రకృతి, సంస్కృతితో మమేకమై అరుణాచల్ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ప్రధాని అన్నారు. “మీ కృషి, పట్టుదలతోనే జీవ వైవిధ్యపరంగా అరుణాచల్ అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది” అని రాష్ట్ర ప్రజలను ప్రధాని అభినందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, స్వయం సహాయ సంఘాల ముందంజకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా రాష్ట్రాభిభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. పర్యాటకంపరంగా అంతర్జాతీయ స్థాయిలో అరుణాచల్కుగల అవకాశాల సద్వినియోగంపై తన నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
My message on the Statehood Day of Arunachal Pradesh. https://t.co/9Y1EC2V609
— Narendra Modi (@narendramodi) February 20, 2022
आप सभी को अरुणाचल प्रदेश के 36वें राज्य स्थापना दिवस की बहुत-बहुत बधाई।
— PMO India (@PMOIndia) February 20, 2022
50 वर्ष पूर्व नेफा को अरुणाचल प्रदेश के रूप में नया नाम, नई पहचान मिली थी।
उगते सूरज की इस पहचान को, इस नई ऊर्जा को इन 50 वर्षों में आप सभी परिश्रमी, राष्ट्रभक्त बहनों-भाइयों ने निरंतर सशक्त किया है: PM
राष्ट्रभक्ति और सामाजिक सद्भाव की जिस भावना को अरुणाचल प्रदेश ने नई ऊंचाई दी है, अपनी सांस्कृतिक विरासत को जिस प्रकार आपने संजोया-संवारा है, परंपरा और प्रगति को जिस प्रकार आप साथ लेकर चल रहे हैं, वो पूरे देश के लिए प्रेरणा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2022
आज़ादी के अमृत महोत्सव पर देश, अरुणाचल प्रदेश के उन सभी शहीदों को भी याद कर रहा है, जिन्होंने खुद को राष्ट्र के लिए समर्पित कर दिया।
— PMO India (@PMOIndia) February 20, 2022
एंग्लो आबोर युद्ध हो या फिर आजादी के बाद सीमा की सुरक्षा, अरुणाचल वासियों की वीरता की गाथाएं प्रत्येक भारतवासी के लिए अनमोल विरासत हैं: PM
मेरा ये पक्का विश्वास रहा है कि पूर्वी भारत और खासकर पूर्वोत्तर भारत 21वीं सदी में देश के विकास का इंजन बनेगा।
— PMO India (@PMOIndia) February 20, 2022
इसी भावना के साथ अरुणाचल प्रदेश के विकास को गति देने के लिए बीते 7 सालों में अभूतपूर्व काम किया गया है: PM @narendramodi
हम अरुणाचल को पूर्वी एशिया का एक प्रमुख गेटवे बनाने में पूरी ताकत से जुटे हैं।
— PMO India (@PMOIndia) February 20, 2022
राष्ट्रीय सुरक्षा के लिहाज़ से भी अरुणाचल की भूमिका को देखते हुए आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण किया जा रहा है: PM @narendramodi
अरुणाचल को प्रकृति ने अपने खज़ाने से बहुत कुछ दिया है।
— PMO India (@PMOIndia) February 20, 2022
आपने प्रकृति को जीवन का अंग बनाया है।
अरुणाचल के इस tourism potential को पूरी दुनिया तक पहुंचाने के लिए हम प्रयासरत हैं: PM @narendramodi