Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్-కిసాన్  పదో కిస్తీ ని జనవరి 1న విడుదల చేయనున్న ప్రధాన మంత్రి


క్షేత్ర స్థాయి రైతుల కు సాధికారిత ను కల్పించే నిబద్ధత, సంకల్పాలకు అనుగుణం గా ‘‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్)’’ పథకం లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు పదో కిస్తీ ని 2022వ సంవత్సరం జనవరి 1వ తేదీన మధ్యాహ్నం పూట 12:30 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఇది 10 కోట్ల కు పైగా లబ్ధిదారు రైతు కుటుంబాల కు 20,000 కోట్ల రూపాయల కు పైచిలుకు సొమ్ము బదిలీ కి మార్గాన్ని సుగమం చేయనుంది.

పిఎమ్-కిసాన్ స్కీము లో భాగం గా, ఒక్కో ఏడాది కి 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాల కు అందించడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్క విడత లో 2,000 రూపాయల వంతు న 4 నెలల కు ఒక కిస్తీ పద్ధతి లో మూడు కిస్తీలు గా చెల్లించడం జరుగుతుంది. నిధి ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లోకి నేరుగా బదలాయించడం జరుగుతుంది. ఈ పథకం లో, 1.6 లక్షల కోట్ల పై చిలుకు సమ్మాన రాశి ని ఇంతవరకు బదలాయించడమైంది.

ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి సుమారు 351 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్ ) కు 14 కోట్ల రూపాయల కు పైగా ఎక్విటి గ్రాంటు ను కూడా విడుదల చేస్తారు. ఇది 1.24 లక్షల కు పైగా రైతుల కు లబ్ధి ని కలగజేయనుంది. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ఎఫ్ పిఒ స్ తో సమావేశమవుతారు. దేశ ప్రజల ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించనున్నారు.

ఈ సందర్భం లో కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా హాజరు అవుతారు.

 

***