ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని సింగపూర్ ఉప ప్రధాని శ్రీ థర్మన్ షణ్ముగరత్నమ్ ఈ రోజు కలుసుకొన్నారు.
సింగపూర్ పూర్వ అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్ కన్నుమూత పట్ల సింగపూర్ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. సింగపూర్ తన గొప్ప పుత్రులలో ఒకరిని కోల్పోయిందని ప్రధాన మంత్రి అన్నారు.
శ్రీ షణ్ముగరత్నమ్ వేరు వేరు ద్వైపాక్షిక సహకార సంబంధ కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నదీ, మరీ ముఖ్యంగా నైపుణ్యాల వృద్ధి మరియు స్మార్ట్ సిటీ ల రంగాలలో పురోగతి ఎలా ఉన్నదీ ప్రధాన మంత్రి కి సంక్షిప్తంగా వివరించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 నవంబరు లో సింగపూర్ ను తాను సందర్శించినప్పుడు ఆ పర్యటన విజయవంతం అయిన విషయాన్ని చెబుతూ, ఆ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సహకారం “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి ఎదిగిందంటూ గుర్తుకుతెచ్చుకున్నారు. సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియన్ లూంగ్ త్వరలో భారతదేశ సందర్శనకు తరలి రావడం గురించి తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.
Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore calls on PM @narendramodi.
— PMO India (@PMOIndia) August 26, 2016
via NMApp pic.twitter.com/8sZIYlRpWH