Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి


శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో –

‘‘శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి నాడు ఆయన కు ఇవే శ్రద్ధాంజలి. స్వాతంత్య్ర సంగ్రామాని కి ఆయన ఇచ్చిన తోడ్పాటు, పరిపాలన లోను, మేధస్సు కు సంబంధించి కౌశలానికి గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతున్నది.

గవర్నర్ జనరల్ గా శ్రీ రాజాజీ పదవీ ప్రమాణం చేస్తున్నప్పటి చిత్రాన్ని మరియు భారత రత్న తో ఆయన ను గౌరవిస్తున్నట్లుగా సూచించిన అధికార ప్రకటన ను ఇక్కడ శేర్ చేయడమైంది. https://t.co/psAnq7i9bo

శ్రీ రాజాజీ బహుళ ప్రశంసల ను పొందిన రాజనీతిజ్ఞుడు. ఆయన శ్రేయాన్ని సదా అపేక్షించిన వారిలో సర్ దార్ పటేల్ గారు ఒకరు.

భారతదేశాని కి గవర్నర్ జనరల్ గా శ్రీ రాజాజీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు శ్రీ సర్ దార్ పటేల్ ఆయన కు రాసిన ఒక ఉత్తరం లో కొంత భాగాన్ని ఇదుగో ఇక్కడ చూడవచ్చును. https://t.co/FN2N2FNAs6 అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH