Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి నవంబర్ 19న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు  ఆయన 6250 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభిస్తారు.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 19 న ఉత్తర్ ప్రదేశ్ లో  మహోబా, ఇంకా ఝాంసీ జిల్లాల ను సందర్శించనున్నారు.

నీటి సమస్య ను నివారించడం కోసం చేపట్టే ఒక ముఖ్యమైన కార్యక్రమం లో భాగం గా మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి మహోబా లో పలు పథకాల ను ప్రారంభిస్తారు.  ఈ పథకాలు ఆ ప్రాంతం లో నీటి ఎద్దడి సమస్య ను దూరం చేయడం లో సహాయకారి కావడం ఒక్కటే కాకుండా, రైతుల కు ఎంతో అవసరమైన ఉపశమనాన్ని కూడా ప్రసాదించనున్నాయి.  ఈ పథకాల లో అర్జున్ సహాయక్ ప్రాజెక్టు, రాతౌలీ వియర్ ప్రాజెక్టు, భావని డ్యామ్ ప్రాజెక్టు, మజ్ గావ్-చిల్లీ స్ప్రింక్లర్  ప్రాజెక్టు వంటివి కూడా కలిసి ఉన్నాయి.  ఈ ప్రాజెక్టులు అన్నింటికీ కలిపి 3250 కోట్ల రూపాయల పై చిలుకు వ్యయం కానుంది.  మరి, ఇవి ఒకసారి పని చేయడం ప్రారంభించాయి అంటే గనుక  మహోబా, హమీర్ పుర్, బాందా, లలిత్ పుర్ జిల్లాల లో దాదాపు గా 65,000 హెక్టార్ ల భూమి లో సేద్యాని కి సహకరించి, ఆ ప్రాంతం లో లక్షల కొద్దీ రైతుల కు ప్రయోజనాన్ని అందించగలుగుతాయి.  ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతాని కి తాగునీటి ని కూడా సమకూర్చుతాయి.

సాయంత్రం పూట 5 గంటల 15 నిమిషాల కు ప్రధాన మంత్రి ఝాంసీ లో గరౌతా వద్ద 600 ఎమ్ డబ్ల్యు అల్ట్రామెగా సోలర్ పవర్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు.  దీనిని 3,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది.  ఇది చౌకగా విద్యుత్తు ను సమకూర్చడం తో పాటు గ్రిడ్ కు స్థిరత్వాన్ని సైతం అందించడం లో సాయపడుతుంది.

ప్రధాన మంత్రి ఝాంసీ లో అటల్ ఏక్తా పార్క్ ను కూడా ప్రారంభిస్తారు.  పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ పేరు ను పెట్టిన ఈ పార్కు ను 11 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరిగింది.  ఇది సుమారు 40,000 చదరపు మీటర్ల మేర విస్తరించింది.  దీని లో భాగం గా ఒక గ్రంథాలయం, ఇంకా శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ విగ్రహం ఉంటాయి.  ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని రూపుదిద్దిన ప్రముఖ శిల్పి శ్రీ రామ్ సుతార్ నిర్మించారు.
 

 

***