Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆచార్య కృపలానీ జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి


భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామాని కి ఆచార్య కృపలానీ గారు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఈ రోజు న ఆచార్య కృపలానీ గారి జయంతి సందర్భం లో, ప్రధాన మంత్రి ఆయన ను మన దేశం పట్ల ఆయన కు గల గొప్పదైనటువంటి దృష్టికోణానికి గాను ప్రశంసించారు. అలాగేక, పర్యావరణ పరిరక్షణ దిశ లో, సామాజిక సాధికారిత కల్పన దిశ లో ఆచార్య కృపలానీ గారు అందించిన తోడ్పాటు ను సైతం ప్రధాన మంత్రి కొనియాడారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘బాపూ జీ నాయకత్వం లో జరిగిన భారతదేశం యొక్క స్వాతంత్య్ర సమరం లో ఆచార్య కృపలానీ గారు అందరి కంటే ముందు వరుస లో నిలచారు. ఆయన కు మన దేశం పట్ల ఒక గొప్పదైన దృష్టి కోణం అంటూ ఉండింది. మరి దానిని సాకారం చేయడం కోసం పార్లమెంటు సభ్యుని హోదా లో ఆయన కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణ దిశ లోను, సామాజిక సాధికారిత కల్పన దిశ లోను ఆయన అపారమైన తోడ్పాటు ను అందించారు. ఆచార్య కృపలానీ గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AKJ