యార్ ఎక్స్ లన్సి, ప్రెసిడెంట్ శ్రీ బైడెన్,
సప్లయ్ చైన్ రిజిలియన్స్ అనేటటువంటి ముఖ్యమైన అంశం పై ఈ శిఖర సమ్మేళనం చొరవ తీసుకొన్నందుకు మీకు నేను ధన్యవాదాలు పలుకుతున్నాను. మీరు బాధ్యతల ను స్వీకరించిన వెనువెంటనే ‘‘అమెరికా తిరిగి వచ్చింది’’ అన్నారు. మరి అంత తక్కువ కాలం లో, ఇది జరగడాన్ని మనమంతా గమనిస్తున్నాం. మరి ఈ కారణం గా, నేను అంటాను ‘‘మీకు మళ్లీ స్వాగతం’’ అని.
ఎక్స్ లన్సిజ్,
మహమ్మారి ఉత్పన్నం అయిన మొదట్లో, మనం అందరం టీకా మందులు, ఆరోగ్య సంబంధిత సామగ్రిల తో పాటు అత్యవసర ఔషధాల ను ఉత్పత్తి చేయడం కోసం కావలసిన ముడి పదార్థాల కు కొదువ ఉందని గ్రహించాం. ప్రస్తుతం ప్రపంచం ఆర్థికం గా తిరిగి కోలుకొనే ప్రయత్నాల లో పడింది. మరి ఇప్పుడు సెమి కండక్టర్ స్, ఇంకా ఇతర సరకుల కు చెందిన సరఫరా సంబంధి సమస్యలు ఆరోగ్యకర వృద్ధి కి అడ్డం వస్తున్నాయి. శిపింగ్ కంటేనర్ ల కు సైతం లోటు తలెత్తుతుందని ప్రపంచం లో ఎవరైనా ఆలోచించారా ?
ఎక్స్ లన్సిజ్,
ప్రపంచం లో టీకా మందుల సరఫరా ను మెరుగు పరచడం కోసం వ్యాక్సీన్ ల ఎగుమతి ని భారతదేశం వేగవంతం చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఉత్తమమైనటువంటి, తక్కువ ధర కు దొరికేటటువంటి కోవిడ్-19 వ్యాక్సీన్ ను సరఫరా చేయడం కోసం మేం మా క్వాడ్ భాగస్వాముల తో కలసి కృషి చేస్తున్నాం. వచ్చే సంవత్సరం లో ప్రపంచాని కి అందించడం కోసం 5 బిలియన్ కోవిడ్ వ్యాక్సీన్ డోజుల ను ఉత్పత్తి చేయాలని భారతదేశం నడుం బిగిస్తోంది. ఇది జరగాలి అంటే అందుకు ముడి పదార్థాల సరఫరా లో ఎలాంటి అడ్డం కి ఉండకుండా చూడటం అనేది చాలా ముఖ్యం.
ఎక్స్ లన్సిజ్,
ప్రపంచం లో సరఫరా వ్యవస్థ లను మెరుగు పరచాలి అంటే అందుకు ముఖ్యం గా మూడు అంశాలు అత్యంత ముఖ్యమైనవి అని నేను నమ్ముతున్నాను. అవి ఏమేమిటి అంటే – విశ్వసనీయమైన వనరు, దాపరికం అనేది లేకపోవడమూ, నిర్ణీత కాలమూ ను. మన సరఫరా లు అనేవి ఒక నమ్మకమైనటువంటి మూలాల వద్ద నుంచి ఉండడం అనేది చాలా జరూరు అయినటువంటిది. మనం భద్రత పరం గా కలసికట్టు గా ముందుకు పోవాలి అనేది కూడా ముఖ్యమైందే. విశ్వసనీయమైనటువంటి మూలాలు అవశ్యం ఏ విధం గా ఉండాలి అంటే అవి ఎలాంటి ప్రతీకార ధోరణి కి లోబడరాదు. అలా ఉంటేనే సరఫరా వ్యవస్థ ను దెబ్బ కు దెబ్బ వైఖరి బారి నుంచి సురక్షితం గా ఉంచుకోవచ్చును. సరఫరా వ్యవస్థ ఆధారపడదగింది గా ఉండాలంటే దానికి సంబంధించి పారదర్శకత్వం తప్పక ఉండితీరాలి. పారదర్శకత్వం లోపించినందువల్లనే ప్రపంచం లోని చాలా కంపెనీ లు చిన్న చిన్న వస్తువుల విషయం లో లోటు ను ఎదుర్కొంటున్నాయి. అత్యవసరమైన వస్తువు లు సకాలం లో సరఫరా కానట్లయితే, అటువంటప్పుడు భారీ నష్టాలు సంప్రాప్తిస్తాయి. కరోనా కాలం లో ఫార్మా మరియు మెడికల్ సప్లయ్ స్ లో మనం ఈ స్థితి ని స్పష్టం గా చూశాం. కాబట్టి, నిర్ణీత కాలం లోపల సరఫరా కు పూచీ పడాలి అంటే మనం సరఫరా వ్యవస్థల ను వేరు వేరు చోట్ల కు విస్తరింప చేసుకోవలసి ఉంటుంది. మరి దీని కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల లో ప్రత్యామ్నాయ తయారీ సామర్ధ్యాల ను తీర్చి దిద్దాలి.
ఎక్స్ లన్సిజ్,
భారతదేశం ఔషధ నిర్మాణ సంబంధి అంశాలు, ఐటి, ఇంకా ఇతర వస్తువు ల విషయం లో విశ్వసించదగిన వనరుల ను కలిగి ఉన్న దేశం గా తనకంటూ ఒక పేరు ను తెచ్చుకొంది. మేం స్వచ్ఛ సాంకేతిక విజ్ఞానం సంబంధి సరఫరా వ్యవస్థ ఏర్పాటు లో కూడాను మాదైన భూమిక ను నిర్వహించడం కోసం ఎదురుచూస్తున్నాం. ఒక నిర్ణీత కాలం లోపల, మన ఉమ్మడి ప్రజాస్వామ్య విలువ ల ఆధారం గా, తదుపరి కార్యాచరణ ప్రణాళిక ను తయారు చేయడం కోసం వెంటనే కలవాలి అని మనం జట్ల ను ఆదేశించాలి అని నేను సూచిస్తున్నాను.
మీకు ధన్యావాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***