Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పునరుజ్జీవనం మరియు పట్టణాలలో మార్పు తీసుకుని రావడానికి రూపొందించిన అటల్ మిషన్ అమృత్ 2.0 ని 2025-26 వరకు అమలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశం అయిన మంత్రివర్గం దేశంలో పునరుజ్జీవనం మరియు పట్టణాలలో మార్పు తీసుకుని రావడానికి రూపొందించిన  అటల్ మిషన్ అమృత్ 2.0 ని 2025-26 వరకు అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో భాగంగా పట్టణాల్లో నీటి వినియోగ విధానాలను మెరుగుపరచి ‘ నీటి భద్రత’ ‘ స్థిరమైన అభివృద్ధి’ సాధించాలన్న లక్ష్యంతో అమృత్ 2.0 పథకాన్ని కేంద్ర అమలు చేస్తున్నది. ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేసి, పారిశుధ్య పరిస్థితులను మెరుగు పరచే అంశాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కల్పించి, నీటి వనరులను సంరక్షించడం/ జల వనరులను మెరుగుపరచడం, బావులు, చెరువుల పునరుజ్జీవనం,  ఉపయోగించిన నీరును శుద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తేవడం, వర్షం నీరును నిల్వ చేయడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలని పథకంలో నిర్దేశించారు. పైపుల ద్వారా నీరు సరఫరా చేసి, ప్రతి ఇంటికి వ్యర్ధ మురుగు సౌకర్యాలను కల్పించి పట్టణ ప్రాంతాలలో ప్రజలు సౌకర్యవంతంగా జీవించే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుంది. 

2015 జూన్ నెలలో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్ )ను  500 పట్టణాల్లో కొళాయి కనెక్షన్లను ఇచ్చి ప్రజలకు ప్రయోజనం కల్పించడానికి జాతీయ జల మిషన్ గా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ఇంతవరకు 1.1 కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లను కల్పించి, 85 లక్షల మురుగు/ వ్యర్థ శుద్ధి సౌకర్యాలు కల్పించారు. 6000 ఎంఎల్ డి మురుగు నీటిని శుద్ధి చేయడానికి సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 1,210 ఎంఎల్ డి సౌకర్యాలను అభివృద్ధి చేశారు. దీనిలో 907 ఎంఎల్ డిల శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడానికి సౌకర్యాలను కల్పించారు. 3,600 ఎకరాల విస్తీర్ణంలో 1,820 పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది. మరో 1,800 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. ఇంతవరకు ముంపుకు గురవుతున్న 1,700 ప్రాంతాలకు రక్షణ కల్పించడం జరిగింది. 

అమృత్ సాధించిన లక్ష్యాల స్ఫూర్తితో అమృత్ 2.0 కి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అమృత్ 2.0 కింద 4,378 పట్టణాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. దీనితో పాటు 500 అమృత్ పట్టణాల్లో ప్రతి ఇంటికి మురుగు/ వ్యర్ధ నీటి శుద్ధి సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. 2.68 కొళాయి కనెక్షన్లు, 2.64 కోట్ల మురుగు/వ్యర్ధ కనెక్షన్లు ఇచ్చి లక్ష్యాలను సాధించాలని నిర్ణయించడం జరిగింది. 

అమృత్ 2.0 పథకాన్ని 2,77,000 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు చేస్తారు. దీనిలో కేంద్రం తన వాటాగా 2021-22 నుంచి 2025-26 వరకు అయిదు సంవత్సరాల పాటు 7,760 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది. 

ఆధునిక సాంకేతిక విహనాల సహకారంతో పథకం అమలు జరుగుతున్న తీరును సమీక్షిస్తారు. జియో ట్యాగ్ చేయబడుతుంది. కాగితాలతో పని లేకుండా అమలు జరిగే ఈ పథకం కింద పట్టణాలు అందుబాటులో ఉన్న జల వనరులను గుర్తించడం, నీటి వినియోగం, సంరక్షణ, నీటి నష్టాలు, భవిష్యత్ అవసరాలను మదింపు వేసి కార్యాచరణ పధకాన్ని సిద్ధం చేస్తాయి. వీటి ఆధారంగా రాష్ట్ర స్థాయి కార్యాచరణ కార్యక్రమం రూపు దిద్దుకుంటుంది. రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళికగా వ్యవహరించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేయడానికి అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భారిస్థాయి.  రాష్ట్ర స్థాయి కార్యాచరణ పథకం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. 

అమృత్ 2.0 పథకం రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీని ప్రోత్సహిస్తుంది. 10 లక్షలు అంతకు మించి జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులలో 10 శాతం ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేయాలని నిబంధన విధించారు. దీనివల్ల నిధుల సేకరణకు అవకాశం కలుగుతుంది. జల వనరుల రంగంలో ఆధునిక  సాంకేతికతను వినియోగించడానికి  కూడా  ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. జల రంగంలో ప్రవేశించడానికి పారిశ్రామికవేత్తలు/ అంకుర సంస్థలను ప్రోత్సహించడం జరుగుతుంది.    నీటి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి సమాచార విద్య మరియు కమ్యూనికేషన్  ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

స్థానిక సంస్థల ఆర్ధిక , నీటి భద్రత అంశాలలో అనుసరిస్తున్న విధానాల్లో సంస్కరణలను అమలు చేయడాన్ని పధకం ప్రోత్సహిస్తుంది. నీటి అవసరాల్లో 20 శాతం అవసరాలను పునర్వినియోగ నీటి ద్వారా కల్పించడం, ఆదాయం రాని  నీటి వినియోగాన్ని  20% కంటే తక్కువకు తగ్గించడం మరియు నీటి వనరుల పునరుజ్జీవనం ప్రధాన నీటి సంబంధిత సంస్కరణలుగా అమలు జరుగుతాయి. ఆస్తి పన్నువినియోగ  ఛార్జీల వసూలు స్థానిక సంస్థల పరపతి విలువను పెంచడం లాంటి ఇతర ముఖ్యమైన సంస్కరణలను అమలు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది.