Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబరు12 న  ఎన్  హెచ్ఆర్ సి 28 వ స్థాపన దినం కార్యక్రమాని కిహాజరవనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 12 వ తేదీ నాడు జరుగనున్న జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28 వ స్థాపక దినం సంబంధి కార్యక్రమం లో ఆ రోజు న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఆ సందర్భం లో ఆయన ఒక ప్రసంగాన్ని కూడా ఇవ్వనున్నారు.

ఆ కార్యక్రమం లో కేంద్ర హోం మంత్రి తో పాటు ఎన్‌ హెచ్ఆర్‌ సి చైర్ పర్సన్ కూడా పాల్గొంటారు.

జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) ని గురించి:

మానవ హక్కుల పరిరక్షణ కోసం మరియు మానవ హక్కుల ను పెంపొందింప చేయడం కోసం 1993 వ సంవత్సరం లో అక్టోబరు 12న మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 పరిధి లో ఎన్‌ హెచ్ఆర్‌ సి ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం మానవ హక్కు ల అతిక్రమణ ఘటనల ను అవి ఏ రూపం లో జరిగనా సరే వాటి ని ఆధికారికం గా గుర్తించి, విచారణల ను నిర్వహించి, మరి మానవ హక్కు ల అతిక్రమణల కేసుల లో బాధితుల కు పరిహారం చెల్లించాలని, తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల కు వ్యతిరేకం గా చట్ట పరమైనటువంటి చర్యల తో పాటు ఇతర పరిహారాత్మక చర్యల ను తీసుకోవాలని ప్రభుత్వ అధికార సంస్థల కు సిఫారసుల ను చేస్తుంది.

 

***