Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నటులు శ్రీ ఘన శ్యామ్ నాయక్, శ్రీ అరవింద్ త్రివేదీ ల కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


నటులు శ్రీ ఘనశ్యామ్ నాయక్, శ్రీ అరవింద్ త్రివేదీ ల కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో –

‘‘మనం ప్రతిభావంతులైన ఇద్దరు నటుల ను గత కొద్ది రోజుల లో కోల్పోయాం. వారు వారి కృషి తో ప్రజల మనస్సుల ను గెలుచుకొన్నారు. శ్రీ ఘనశ్యామ్ నాయక్ ను ఆయన పోషించిన బహుముఖీన పాత్రల కు గాను, మరీ ముఖ్యం గా ప్రజాదరణ పొందినటువంటి తారక్ మెహతా కా ఉల్ టా చశ్మాలో ఆయన పోషించిన పాత్ర కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన అమిత దయాళువు, వినయం మూర్తీభవించినటువంటి వారు కూడాను.

మనం శ్రీ అరవింద్ త్రివేదీ ని కూడా కోల్పోయాం. ఆయన ఒక అసాధారణమైనటువంటి నటుడే కాక ప్రజాసేవ పట్ల మక్కువ కలిగినటువంటి వారు కూడాను. రామాయణ్ టివి సీరియల్ లో ఆయన నటన కు గాను భారతీయుల లో కొన్ని తరాల పాటు ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఇద్దరు నటుల కుటుంబాల కు, ఆ నటుల ను అభినందించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’

అని పేర్కొన్నారు.

 

***

DS/SH