ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిచా గాంధీ ప్రతిస్థాన్ వేదికపై ఏర్పాటు చేసిన సదస్సు మరియు ప్రదర్శనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 5న ఉదయం 10.30 గంటలకు ఆజాదీ @75- నూతన నగర భారతదేశం: నగరీకరణలో సాధిస్తున్న ప్రగతి కార్యక్రమం పేరిట సదస్సు, ప్రద్శన ప్రారంభం కాబోతున్నది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 75 వేల మంది నివాస గృహ లబ్ధిదారులకు ప్రధాని స్వయంగా డిజిటల్ తాళం చెవులను అందజేస్తారు. అంతే కాదు ఈ పథకం కింద లబ్ధిదారులైన వారితో ఆయన సంభాషిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 75 నగరాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంగానీ, పునాది రాయి వేయడంగానీ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఆకర్షణీయ నగరాలు, అమృత్ పథకానికి సంబంధించినవి. లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, గోరఖ్ పూర్, ఝాన్షీ, ఘజియాబాద్ మొదలైన ఏడు నగరాలకు సంబంధించి ఫెమ్ 11 కింద 75 బస్సులను ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన 75 ప్రాజెక్టుల వివరాల కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మూడు ప్రదర్శనల్ని ఆయన సందర్శిస్తారు. లక్నోలోని బాబాసాహెబ్ బీమారావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి చెయిర్ నెలకొల్పుతున్నట్టు ప్రకటిస్తారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రితోపాటు రాష్ట్ర గవర్నర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొంటారు.
సదస్సు మరియు ప్రదర్శనకు సంబంధించిన వివరాలు :
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో సదస్సుతోపాటు ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు మరియు ప్రదర్శన ఈ నెల 5నుంచి 7వరకు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పట్టణ, నగరాల అభివృద్ధిలో వచ్చిన మార్పును ఈ కార్యక్రమంద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. తద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అనుభవాలను పంచుకుంటాయి.
ఈ కార్యక్రమంలో మూడు ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు.
1. నూతన పట్టణ /నగర భారతదేశం అనే పేరు మీద ఆయా నగరాల్లో చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. గత ఏడు సంవత్సరాల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారు. భవిష్యత్ కార్యాచరణ గురించి వివరిస్తారు.
2. 75 రకాల వినూత్న నిర్మాణ సాంకేతికతల్ని ప్రదర్శిస్తారు. దీనికి భారతీయ గృహనిర్మాణ సాంకేతిక మేలా అనే పేరు పెట్టారు. దీని కింద అంతర్జాతీయంగా గృహ నిర్మాణంలో వచ్చిన సవాళ్లను, దేశీయంగా తయారు చేసుకున్న నిర్మాణ సాంకేతికతల్ని, వస్తువుల్ని, విధానాల్ని ప్రదర్శిస్తారు.
3. మూడో ప్రదర్శనలో 2017 తర్వాత ఉత్తరప్రదేశ్ లో చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాలను ప్రద్శిస్తారు. యూపీ @75: ఉత్తరప్రదేశ్లో మారుతున్న పట్టణాలు అనే అంశం కింద ఈ ప్రదర్శన వుంటుంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కింద చేపట్టిన ప్రతిష్టాత్మక పట్టణాభివృద్ధి కార్యక్రమాలను, విజయాలను ఈ ప్రదర్శనల ద్వారా తెలియజేస్తారు. పరిశుభ్రమైన పట్టణ భారతం, నీటి భద్రత కలిగిన నగరాలు, అందరికీ గృహాలు, నూతన నిర్మాణ సాంకేతికతలు, ఆకర్షణీయ నగరాల అభివృద్ధి, సుస్థిర చలనం, జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించే నగరాలు..మొదలైన అంశాల కింద ఈ ప్రదర్శనల్ని రూపొందించారు.
ఈ సదస్సు మరియు ప్రదర్శన కార్యక్రమం రెండు రోజులపాటు అంటే ఈ నెల 6న, 7న ప్రజల సందర్శనకు అందుబాటులో వుంటుంది.
****