ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక చారిత్రిక చొరవ లో భాగం గా 2021 అక్టోబరు 1వ తేదీన ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ఆమ్బేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, దానితో పాటు అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) 2.0 ను కూడా ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా, మన నగరాలన్నిటి ని ‘చెత్త కు తావు లేనివి గా’, ‘జల సురక్షితమైనేవి గా’ తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష ను నెరవేర్చడం కోసం ఎస్ బిఎమ్-యు 2.0 ను, అమృత్ 2.0 ను రూపొందించడం జరిగింది. ఈ ప్రముఖ మిశన్ లు భారతదేశం లో శరవేగం గా జరుగుతున్న పట్టణీకరణ తాలూకు సవాళ్ళ ను ప్రభావవంతమైన రీతి న పరిష్కరించే దిశ లో ఒక అడుగు ను ముందుకు వేసే సంకేతాన్ని ఇవ్వడం తో పాటు సస్ టేనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ 2030 ని సాధించే దిశ లో సైతం తోడ్పాటు ను అందించనున్నాయి.
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి మరియు సహాయ మంత్రి, ఇంకా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కూడా ఈ సందర్భం లో పాలుపంచుకొంటారు.
స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను గురించి
అన్ని నగరాల ను ‘చెత్త కు తావు లేనటువంటివి’ గా మార్చాలని, అమృత్ పరిధి లోకి రానటువంటి నగరాల లో మురికి మరియు నలుపు నీటి నిర్వహణ కు పూచీ పడాలని, అన్ని నగరాల లో స్థానిక సంస్థల ను ఒడిఎఫ్+ గా, అదే విధం గా ఒక లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల ను ఒడిఎఫ్++ గా తీర్చి దిద్దాలని ఎస్ బిఎమ్-యు 2.0 ను తీసుకు రావడం జరిగింది. దీని తో పట్టణ ప్రాంతాల లో సురక్షత తో కూడిన పారిశుధ్యం లక్ష్యాన్ని ఆవిష్కరించడం సాధ్యపడగలదు. ఈ మిశన్ లో భాగం గా ఘన వ్యర్థాల ను మూలం వద్దే వేరు పరచడం, 3 ‘R’ ల (రిడ్యూస్.. అంటే తగ్గించు, రియూజ్ .. అంటే మళ్లీ వినియోగించు, రిసైకిల్.. పునరుపయోగించు) సిద్ధాంతాల ను ఆచరణ లో పెడుతూ, అన్ని రకాల పట్టణ ఘన వ్యర్థాల ను శాస్త్రీయమైన పద్ధతి లో శుద్ధి పరచడం పైన మరియు ప్రభావవంతమైనటువంటి రీతి న ఘన వ్యర్థాల నిర్వహణ కోసం డంప్ సైట్ లను మెరుగుపరచడం పైన దృష్టి ని కేంద్రీకరించడం జరుగుతుంది. ఎస్ బిఎమ్-యు 2.0 కు దాదాపు గా 1.41 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
అమృత్ 2.0 ను గురించి
సుమారు గా 2.68 కోట్ల సీవర్ / సెప్టేజ్ కనెక్శన్ లను అందించి రమారమి 2.64 కోట్ల నల్లా కనెక్శన్ లను మరియు 500 అమృత్ నగరాల లో సీవరేజ్ / సెప్టేజ్ తాలూకు 100 శాతం కవరేజ్ ను కల్పిస్తూ, దాదాపు 4,700 పట్టణ ప్రాంత స్థానిక సంస్థ ల పరిధి లోని అన్ని ఇళ్ల లో తాగునీటి సరఫరా సదుపాయాన్ని సమకూర్చాలి అనేది అమృత్ 2.0 లక్ష్యం గా ఉంది. దీని ద్వారా పట్టణ ప్రాంతాల లో 10.5 కోట్ల కు పైగా ప్రజల కు లబ్ధి కలుగుతుంది. అమృత్ 2.0 లో సర్క్యులర్ ఇకానమి తాలూకు సిద్ధాంతాల ను అవలంబించడం జరుగుతుంది. ఉపరితల మరియు భూగర్భ జలాశయాల సంరక్షణ ను, వాటి పునరుద్ధరణ ను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ మిశన్ ప్రపంచం లోని ఆధునిక, సాంకేతికత లను, నైపుణ్యా ల తాలూకు లాభాల ను వినియోగించుకోవడం కోసం జల నిర్వహణ, ఇంకా టెక్నాలజీ సబ్- మిశన్ లో డేటా ఆధారిత పాలన ను పెంచుతుంది. నగరాల మధ్య ప్రగతిశీల స్పర్ధ ను పెంచడం కోసం ‘పేయ్ జల్ సర్వేక్షణ్’ ను నిర్వహించడం జరుగుతుంది. అమృత్ 2.0 కు దాదాపు గా 2.87 లక్షల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది.
ఎస్ బిఎమ్-యు, ఇంకా అమృత్ ల ప్రభావం
ఎస్ బిఎమ్-యు, అమృత్ లు గడచిన ఏడు సంవత్సరాల కాలం లో పట్టణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మెరుగు పరచడం లో మహత్వపూర్ణమైనటువంటి తోడ్పాటు ను అందించాయి. ఈ రెండు ప్రముఖ మిశన్ లు పౌరుల కు నీటి సరఫరా తో పాటు స్వచ్ఛత తాలూకు మౌలిక సేవల ను అందించే సామర్ధ్యాన్ని వృద్ధి చెందింపచేశాయి. స్వచ్ఛత అనేది ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం గా మారిపోయింది. అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ను బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన రహితం (ఓపన్ డిఫాకేశన్ ఫ్రీ.. ‘ఒడిఎఫ్’) గా ప్రకటించడమైంది. అంతేకాదు, ఘన వ్యర్థాల లో 70 శాతం వరకు ఇప్పుడు శాస్త్రీయమైన పద్ధతుల లో శుద్ధి పరచడం జరుగుతున్నది. అమృత్ 1.1 కోట్ల కుటుంబాల కు నల్లా కనెక్శన్ లను సమకూర్చడం తో పాటు, 85 లక్షల మురుగు నీటి పారుదల కనెక్శన్ లను జోడించడం ద్వారా జల సంబంధి సురక్ష కు పూచీ పడటం లో నిమగ్నం అయింది. దీని తో 4 కోట్ల మంది కి పైగా ప్రజానీకం ప్రయోజనాల ను పొందగలుగుతారు.
***