ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 27 వతేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా , ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎం-డిహెచ్ఎం)ను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసంగిస్తారు.
2020 ఆగస్టు 15న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల నుంఇ చేసిన ప్రసంగంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పైలెట్ ప్రాజెక్టును ప్రకటించారు. ప్రస్తుతం పిఎం-డిహెచ్ఎం ను ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
ఆయుష్మాన్భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పిఎం -జెఎవై) మూడవ ఏడాది ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలోనే ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎం- డిహెచ్ఎం)ను దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి పాల్గొంటారు.
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎం-డిహెచ్ఎం ) గురించి:
జన్ ధన్, ఆధార్, మొబైల్ ( జె.ఎ.ఎం)మూడు పునాదిగా అలాగే ప్రభుత్వం చేపట్టిన ఇతర డిజిటల్ కార్యకలాపాల ఆధారంగా పిఎం- డిహెచ్ఎం విస్తృత స్థాయిలో గణాంకాలు,సమాచారం, మౌలిక సదుపాయాల సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా , ప్రమాణీకృత డిజిటల్ వ్యవస్థల ద్వారా ఆరోగ్య సంబంధిత వ్యక్తిగత సమాచారం విషయంలో భద్రత, గోప్యత, కు వీలుకల్పిస్తూ సమాచారాన్ని పరస్పరం అందుబాటులోకి తెచ్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఈ కార్యక్రమం కింద ఆరోగ్య రికార్డులను పౌరుల సమ్మతితో వారి ఆమోదంతో అందుబాటులోకి తేవడానికి, మార్పిడికి వీలు కల్పిస్తుంది.
పిఎం డిహెచ్ ఎం కింద ప్రతి పౌరుడికి ఆరోగ్య ఐడిని ఏర్పాటుచేయడం జరుగుతుంది. ఇది వారి ఆరోగ్య ఖాతాగా ఉపయోగపడుతుంది. దీనికి వారి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడం, వాటిని మొబైల్ అప్లికేషన్ ద్వారా చూడడానికి వీలు కల్పించడం జరుగుతుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (హెచ్‌పిఆర్), హెల్త్ కేర్ ఫెసిలిటీ రిజిస్ట్రీస్ (హెచ్ ఎఫ్ ఆర్)లు ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య వైద్యసేవలు అందించే వారి రిపాజిటరీగా ఉపకరిస్తుంది. ఇది డాక్టర్లు, ఆస్పత్రులు, ఆరోగ్య సేవలు అందించేవారికి సులభతర సేవలు కార్యకలాపాలు అందించేందుకు వీలు కల్పిస్తుంది.
పిఎం- డిహెచ్ ఎం శాండ్ బాక్స్‌కు ఈ మిషన్‌లో భాగంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇది టెక్నాలజీ ఫ్రేమ్‌వర్క్‌గా, ప్రాడక్ట్ టెస్టింగ్ కు ఆయా సంస్థలకు ఉపయోగపడుతుంది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లో భాగంగా హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ లేదా హెల్త్ ఇన్ఫర్మేషన్ వినియోగదారు తా లేదా పిఎం- డిహెచ్ ఎంతో సమర్థ అనుసంధానతను ఏర్పరచేందుకు ఆసక్తి చూపే ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ మిషన్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌లో అంతర్గత అనుసంధానతను సృష్టిస్తుంది, చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పోషించిన పాత్ర లాగా ఉంటుంది. పౌరులు హెల్త్‌కేర్ సదుపాయాలను కేవలం ఒక క్లిక్ దూరంలోయాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది.
***