టెలికమ్యూనికేషన్ల రంగంలో తలపెట్టిన అనేక నిర్మాణపరమైన భారీ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్రమంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు,.. టెలికాం రంగాన్ని పరిరక్షించడంతోపాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయని భావిస్తున్నారు. సంస్కరణలు,.. నగదు అందుబాటు అవకాశాలను మెరుగుపరుస్తాయని, పెట్టుబడులను ప్రోత్సహించి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై (టి.ఎస్.పి.లపై) నియంత్రణా పరమైన భారాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.
కోవిడ్-19 వైరస్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనడంలో టెలికాం రంగం చక్కని సామర్థ్యాన్ని, పనితీరును చూపిన నేపథ్యంలో, ఈ సంస్కరణా ప్యాకేజీ కారణంగా,.. బ్రాడ్ బాండ్ సదుపాయం, టెలికాం అనుసంధానం వంటివి మరింత వేగవంతంగా విస్తృతం కాగలవని భావిస్తున్నారు. డాటా వినియోగంపై భారీగా ఒత్తిడి పెరగడం ఆన్ లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల మధ్య అనుసంధానం పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ తాజా సంస్కరణలు టెలికం రంగానికి మరింత ఊపునిస్తాయని ఆశిస్తున్నారు.
కాగా, బలమైన, దృఢమైన టెలికాం రంగం ఏర్పాటు కావాలన్న ప్రధానమంత్రి దార్శనికతను కేంద్రమంత్రివర్గ నిర్ణయంతో మరింత బలోపేతమైంది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పోటీతత్వం పెంచడం, వినియోగదారుకు ఎంపిక సదుపాయం, అంత్యోదయ పథకం, గుర్తింపునకు నోచుకోని అంశాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, ఇప్పటివరకూ బ్రాడ్ బాండ్ సదుపాయంలేని చోట్లకు ఇంటర్నెట్ అనుసంధానంతో సార్వత్రిక బ్రాడ్ బాండ్ అనుసంధానం కల్పించడం తాజా సంస్కరణల ప్యాకేజీ ధ్యేయంగా పెట్టుకున్నారు. 4-జి విస్తృతిని, నగదు అందుబాటులో ఉంచే అవకాశాలు పెంచడం, 5-జి నెట్వర్క్.లో పెట్టుబడుల ప్రోత్సాహానికి తగిన వాతావరణాన్ని కల్పించడం కూడా తాజా సంస్కరణల లక్ష్యం.
ఈ సంస్కరణల ప్యాకేజీలో భాగంగా చేపట్టదలచిన తొమ్మిది నిర్మాణ పరమైన సంస్కరణలను, ఐదు విధానపరమైన సంస్కరణలను, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకోసం ఉపశమన చర్యలను ఈ దిగువన చూడవచ్చు:
నిర్మాణపరమైన సంస్కరణలు
విధానపరమైన సంస్కరణలు
వేలం పాటల తేదీలను సూచిస్తూ ఆక్షన్ క్యాలెండర్ ఏర్పాటు – స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియలు సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిర్వహిస్తారు.
టెలికాం ప్రొవైడర్ల నగదు మార్పిడి వసతి సమస్యకు పరిష్కారాలు
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన ఈ దిగువ అంశాలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది:
పైన పేర్కొన్న సంస్కరణలు అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (టి.పి.ఎస్.లకు) వర్తిస్తాయి. లిక్విడిటీ, నగదు అందుబాటుపై సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుంది. ఈ ఏర్పాట్లు టెలికాం రంగంతో సంబంధం ఉన్న వివిధ రకాల బ్యాంకులకు ఉపయోగపడతాయి.
***