Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆచార్య వినోబా భావే కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి


ఆచార్య వినోబా భావే జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధపూర్వక నమస్సులు అర్పించారు.

‘‘అంటరానితనాని కి పూర్తి వ్యతిరేకం గా నడచుకొన్న వ్యక్తి అంటూ ఆయన ను మహాత్మ గాంధి అభివర్ణించారు. భారతదేశం స్వాతంత్ర్యం పట్ల ఆయన నిబద్ధత అచంచలమైంది. నిర్మాణాత్మక కార్యం అన్నా, అహింస అన్నా ఆయన కు దృఢమైన నమ్మకం ఉండింది. ఆయన శ్రేష్ఠమైన ఆలోచన లు చేసే వారు.

ఆచార్య వినోబా భావే కు ఆయన జయంతి సందర్భం లో నమస్సులు.

భారతదేశాని కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పవిత్రమైన గాంధేయ సిద్ధాంతాల ను ఆచార్య వినోబా భావే ముందుకు తీసుకు పోయారు. పేదల కు, అణగారిన వర్గాల వారికి మంచి నాణ్యమైన జీవనం దక్కేందుకు పూచీ పడాలి అనే ధ్యేయం తో సాగాయి ఆయన నడిపించిన జన ఆందోళన లు. సామూహిక భావన కు ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యం తరాల తరబడి స్ఫూర్తి ని అందిస్తూనే ఉంటుంది.’’ అని అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

****

DS/SH