Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన భారత బృందానికి ప్రధాని అభినందనలు


కౌలాలంపూర్‌లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘కౌలాలంపూర్లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు2024లో చారిత్రక ప్రదర్శన చేసిన భారత బృందానికి శుభాకాంక్షలుప్రతిభావంతులైన మన క్రీడాకారులు అసాధారణ రీతిలో 55 పతకాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారుఇది క్రీడల్లో భారత దేశం కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనఈ అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికిముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారికి స్ఫూర్తిగా నిలిచింది’’.

*****

MJPS/SR