Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హార్న్ బిల్ ఉత్సవానికి 25 ఏళ్ళుః నాగాలాండ్ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు నాగా ప్రజల సాంస్కృతిక వైభవాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఉత్సవంలో పాల్గొనాలంటూ ప్రధాని పిలుపు


 ‘హార్న్ బిల్ ఫెస్టివల్’ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగాలాండ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు వేడుకలకు శుభాకాంక్షలు అందిస్తూ, ఉత్సవంలో సమర్ధమైన వ్యర్థాల నిర్వహణ, అనుకూలమైన పద్ధతుల అనుసరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, కొద్ది సంవత్సరాల కిందట తాను హార్న్ బిల్ ఉత్సవాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాగా ప్రజల సాంస్కృతిక వైభవాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఉత్సవంలో పాల్గొనాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.  
నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నెఫియూ రియో ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకు ప్రధాని ఇలా స్పందించారు
.

“ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఏటి హార్న్ బిల్ ఉత్సవాలకు శుభాకాంక్షలు… చైతన్యభరితమైన హార్న్ బిల్ ఉత్సవాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నాగాలాండ్ ప్రజలకు అభినందనలు. ఈ సంవత్సరపు వేడుకల్లో వ్యర్థాల నిర్వహణ పట్ల చూపుతున్న శ్రద్ధ, అనుసరిస్తున్న ఇతర మంచి పద్ధతులు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని ఏళ్ళ కిందట నేను ఈ ఉత్సవాన్ని సందర్శించినప్పటి చక్కటి అనుభూతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఉత్సవంలో స్వయంగా పాల్గొని నాగా ప్రజల సాంస్కృతిక వైభవంలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను..” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

***

MJPS/TS