Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెప్టెంబ‌ర్ 17వ, 18వ తేదీ ల‌లో వారాణసీ ని సందర్శించనున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గమైన వారాణ‌సీ ని 2018వ సంవత్స‌రం సెప్టెంబ‌ర్ 17వ మరియు18వ తేదీ ల‌లో సందర్శించనున్నారు.

సెప్టెంబ‌ర్ 17వ తేదీ నాటి మ‌ధ్యాహ్నం ఆయ‌న న‌గ‌రానికి చేరుకొంటారు. ఆయ‌న నేరుగా నరూర్ గ్రామానికి వెళ్ళి, అక్క‌డ లాభాపేక్ష లేనటువంటి ‘‘రూమ్ టు రీడ్’’ సంస్థ నుండి స‌హాయాన్ని అందుకొంటూ నడుస్తున్న ఒక ప్రాథ‌మిక పాఠ‌శాల యొక్క విద్యార్థుల తో భేటీ అవుతారు. ఆ త‌రువాత, డిఎల్‌డ‌బ్ల్యు పరిసరాల లో ప్ర‌ధాన మంత్రి కాశీ విద్యాపీఠ్ విద్యార్థుల తో మ‌రియు వారు చేయూత‌ ను అందిస్తున్న బాలల తో భేటీ అవుతారు.

సెప్టెంబ‌ర్ 18వ తేదీ నాడు ప్ర‌ధాన మంత్రి బిహెచ్‌యు యొక్క ఆంఫిథియేట‌ర్‌ లో మొత్తం 500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ్య‌య‌ం కాగల వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌డ‌మో లేదా పునాదిరాయిని వేయడమో చేస్తారు. ఈ ప్రాజెక్టుల లో పాత కాశీ లో ఓ ఇంటిగ్రేటెడ్ ప‌వ‌ర్ డివెల‌ప్‌మెంట్ స్కీమ్ (ఐపిడిఎస్‌) తో పాటు బిహెచ్‌యు లో ఒక అట‌ల్ ఇంక్యుబేశన్ సెంట‌ర్ భాగంగా ఉంటాయి. శంకుస్థాప‌న జ‌ర‌గ‌వ‌ల‌సివున్న ప‌థ‌కాల‌ లో బిహెచ్‌యు లోని రీజ‌న‌ల్ ఆప్తల్మాల‌జీ సెంట‌ర్ కూడా ఒక‌టి గా ఉంది. ప్ర‌ధాన మంత్రి సభికులను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

***