Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 11 వ తేదీ నాడు లక్షలాది ఎఎస్ హెచ్ ఎ, ఎఎన్ఎమ్ మరియు ఆంగన్ వాడీ కార్యకర్తలతో సంభాషించనున్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “పోషణ్ మాహ్” లో భాగంగా 2018వ సంవత్సరం సెప్టెంబర్ 11 వ తేదీ నాడు పదిన్నర గంటలకు

లక్షలాది ఎఎస్ హెచ్ ఎ (‘ఆశ’), ఎఎన్ఎమ్, ఆంగన్ వాడీ కార్యకర్తల తోను, ఆరోగ్య లబ్ధిదారుల తోను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు.

పోషకాహారానికి అంకితం చేసిన “పోషణ్ మాహ్”ను 2018 సెప్టెంబర్ మాసం లో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అత్యంత అనుకూల పోషకాహారాన్ని స్వీకరించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనే సందేశాన్ని దేశం అంతటా ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేయాలనేదే దీని ధ్యేయంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్ లో ఏర్పాటు చేసినటువంటి పోషణ్ అభియాన్ (నేశనల్ న్యూట్రిశన్ మిశన్) యొక్క ధ్యేయాలను తాజా ప్రయత్నం పెంపొందింపజేయగలుగుతుంది. ఎదగకుండా మిగిలిపోయే శారీరిక స్థాయి ని తగ్గించడం, పోషకాహార లోపం సమస్య ను, రక్త హీనత ను మరియు తక్కువ శారీరిక బరువు తో శిశువులు జన్మించడాన్ని కుదించడమే ఈ అభియాన్ లక్ష్యం. పోషణ్ అభియాన్ లో భాగంగా, ప్రభుత్వం స్టంటింగ్, పోషకాహార లోపం, బాలల్లోను, కిశోర వయస్కులైన బాలికల లోను, మహిళల లోను రక్త హీనత సమస్య లను పరిష్కరించాలని, తక్కువ ఒంటి బరువు కలిగిన జననాలను ఏటా క్రమానుగతంగా 2 శాతం, 2 శాతం, 3 శాతం ఇంకా 2 శాతం మేరకు క్షీణింపచేయాలన్న లక్ష్యాలను నిర్దేశించింది.

ఈ అభియాన్ లో పాలుపంచుకొంటున్న వివిధ వర్గాల వారిని ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ఏకతాటి పైకి ప్రధాన మంత్రి సంభాషణ తీసుకు రాగలుగుతుంది. అలాగే, పౌష్టికాహార రంగం లో విజయ గాథ లను వెల్లడి చేసే ఒక వేదిక గా కూడా ఈ సంభాషణ కార్యక్రమం రూపొందనుంది.