ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూలా డా సిల్వా త్వరగా కోలుకోవాలని, చక్కని ఆరోగ్యం కలగాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో బ్రెజిల్ అధ్యక్షుడు పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘అధ్యక్షుడు శ్రీ @LulaOficial’s కు జరిగిన శస్త్రచికిత్స చక్కగా ముగిసిందని, ఆయన కోలుకొంటున్నారని తెలిసి నేను సంతోషిస్తున్నాను. ఆయన బలాన్ని పుంజుకోవడంతోపాటు ఆయన మళ్లీ మంచి ఆరోగ్యవంతునిగా మారాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’
I am happy to know that President @LulaOficial’s surgery went well and that he is on the path to recovery. Wishing him continued strength and good health. https://t.co/BAPKigvydK
— Narendra Modi (@narendramodi) December 12, 2024